logo

అధికార పార్టీ గుత్తేదారు నిర్వాకం

పామూరు పాత చెరువులో చేపల కోసం అధికార పార్టీకి చెందిన ఓ గుత్తేదారు నీటిని వృథాగా కాలువల ద్వారా విడిచిపెట్టేసిన వైనమిది.

Updated : 30 Jan 2023 06:37 IST

చేపలు పట్టేందుకు చెరువు నీరు వృథాగా వదిలేసిన వైనం

చెరువు వద్ద ఆందోళన వ్యక్తంచేస్తున్న గోపాలపురం వాసులు

పామూరు, న్యూస్‌టుడే: పామూరు పాత చెరువులో చేపల కోసం అధికార పార్టీకి చెందిన ఓ గుత్తేదారు నీటిని వృథాగా కాలువల ద్వారా విడిచిపెట్టేసిన వైనమిది. దీంతో రైతులంతా ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. గత నెలలో కురిసిన వర్షాలకు ఈ చెరువు పూర్తి స్థాయిలో నిండింది. చేపల వేలం పాట దక్కించుకున్న గుత్తేదారు వాటిని పట్టించేందుకు ప్రయత్నించారు. చెరువులో నీరు అధికంగా ఉండడంతో ఎలాగైనా తగ్గించాలని శనివారం రెండు తూముల ద్వారా బయటకు వదిలారు. దీంతో విషయం తెలుసుకున్న రైతులు అక్కడికి వచ్చి ఆందోళన వ్యక్తంచేశారు. గత్తేదారు ఇలా చేయడం మూడోసారని.. అయినా యంత్రాంగం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఈ చెరువులో నీరు సమృద్ధిగా ఉంటే పామూరు పట్టణంతో పాటు గోపాలపురం ప్రాంతాలకు ప్రయోజనమన్నారు. భూగర్భ జలాలు తగ్గవని, వేసవిలో నీటి ఎద్దడి సమస్య తలెత్తదన్నారు. ఇప్పుడు వృథాగా వదిలేయడం వల్ల రాబోయే కొద్దినెలల్లో తామంతా తీవ్ర అవస్థలు చూడాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తంచేశారు. ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు.  

తూము ద్వారా వృథాగా పోతున్న నీరు


పరిశీలించి చర్యలు తీసుకుంటాం

పామూరు పాత చెరువు నుంచి నీరు అక్రమంగా వదిలిన విషయం మా దృష్టికి రాలేదు. ఎవరూ ఫిర్యాదు చేయలేదు. పరిశీలించి చర్యలు తీసుకుంటాం. 

బి.రవి, నీటిపారుదలశాఖ డీఈఈ, కనిగిరి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని