logo

ఓటమి భయంతోనే చెవిరెడ్డి బెదిరింపులు

‘మాపై ఉల్లంఘన కేసులు నమోదు చేస్తే మీకే నష్టమంటూ మహిళా రిటర్నింగ్‌ అధికారిణిని వైకాపా ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి బెదిరింపులకు గురిచేయడంపై భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆరె రమణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 26 Apr 2024 04:18 IST

యర్రగొండపాలెం పట్టణం, న్యూస్‌టుడే: ‘మాపై ఉల్లంఘన కేసులు నమోదు చేస్తే మీకే నష్టమంటూ మహిళా రిటర్నింగ్‌ అధికారిణిని వైకాపా ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి బెదిరింపులకు గురిచేయడంపై భాజపా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆరె రమణయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. యర్రగొండపాలెంలో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. జనాదరణ లేకపోవడంతో వైకాపా అభ్యర్థులకు ఓటమి భయం పట్టుకుందన్నారు. దీంతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. అడ్డదారులు తొక్కడాన్ని అడ్డుకుంటున్న అధికారులను ఆ పార్టీ నేతలు బెదిరింపులకు గురిచేస్తున్నారని విమర్శించారు. యర్రగొండపాలెం ఆర్వోను బెదిరించిన చెవిరెడ్డిపై ఎన్నికల కమిషన్‌ వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఆర్వో కార్యాలయంలో వీడియో తీయడాన్ని బలవంతంగా ఆపి వేయించి బెదిరింపులకు  పాల్పడడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని