logo

రఘునాయక కల్యాణం.. గరుత్మంతుని ఆగమనం

నాగులుప్పలపాడు మండలం చదలవాడలో రఘునాయక స్వామి కల్యాణాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు.

Published : 26 Apr 2024 04:39 IST

న్యూస్‌టుడే, నాగులుప్పలపాడు: నాగులుప్పలపాడు మండలం చదలవాడలో రఘునాయక స్వామి కల్యాణాన్ని గురువారం వైభవంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి వీక్షించారు. కల్యాణానికి గరుత్మంతుడు అతిథిగా వస్తారని భక్తుల నమ్మిక. ఈ క్రమంలో గరుడ పక్షి రెండు సార్లు ఆలయ గాలి గోపురం చుట్టూ ప్రదక్షిణలు చేసింది. ఈ దివ్య ఘట్టాన్ని తిలకించిన భక్తులు గోవింద నామ స్మరణ చేశారు.


కనులపండువగా తెప్పోత్సవం

రాచర్ల మండలం జేపీ చెరువు సమీపంలో కొలువైన నెమలిగుండ్ల రంగనాయకస్వామి తెప్పోత్సవాన్ని గురువారం కనులపండువగా నిర్వహించారు. ప్రత్యేకంగా తయారు చేసిన తెప్పపై శ్రీదేవి, భూదేవి సమేత రంగనాయకస్వామిని కొలువుదీర్చి నెమలిగుండంలో విహరించారు. భక్తులు తిలకించి పులకించారు.

న్యూస్‌టుడే, రాచర్ల

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని