logo

పల్లెవనాన్ని పక్కనపడేశారు...

పొదిలి మేజరు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు తెదేపా ప్రభుత్వం  జూనియర్‌ కళాశాల ప్రాంగణంలోపల్లెవనం నిర్మాణాన్ని ప్రారంభించింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం దాన్ని మూలనపడేసింది.

Published : 26 Apr 2024 04:21 IST

పొదిలి, న్యూస్‌టుడే: పొదిలి మేజరు గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు తెదేపా ప్రభుత్వం  జూనియర్‌ కళాశాల ప్రాంగణంలోపల్లెవనం నిర్మాణాన్ని ప్రారంభించింది. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన వైకాపా ప్రభుత్వం దాన్ని మూలనపడేసింది. దీంతో ఆ ప్రదేశం ప్రస్తుతం చిల్లచెట్లు మొలిచాయి. నిర్మాణం కొనసాగించకపోవడంతో గతంలో చేసిన పనులు నిరూపయోగంగా మారాయి. ప్రస్తుతం చినారికట్ల జంక్షన్‌ అవతల నగరవనం పనులు చేస్తున్నాయి. అది పట్టణానికి చాలా దూరం కావడంతో పొదిలి పట్టణ ప్రజలు ఆహ్లాదానికి నోచుకోవడం లేదు. నగర పంచాయతీలో ఉద్యానవనం లేకపోవడంతో ఆహ్లాదంగా గడిపేందుకు చిన్నారులు, పెద్దలు ఇబ్బంది పడుతున్నారు. సుమారు 38 వేల మంది జనాభా ఉన్న ఈ పట్టణంలో ఈ అయిదేళ్ల కాలంలో ఒక్క వనాన్ని ఏర్పాటు చేయలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని