logo

టోల్‌గేట్‌ పన్నుల పెంపుపై నిరసన

కేంద్ర ప్రభుత్వం పెంచిన టోల్‌గేట్‌ పన్నులను వెంటనే ఉపసంహరించుకోవాలంటూ... ఆలిండియా రోడ్డు ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో జాతీయ రహదారి ఉత్తర బైపాస్‌లో శుక్రవారం నిరసన చేపట్టారు.

Published : 01 Apr 2023 04:12 IST

జాతీయ రహదారిపై నిలిచిపోయిన వాహనాలు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: కేంద్ర ప్రభుత్వం పెంచిన టోల్‌గేట్‌ పన్నులను వెంటనే ఉపసంహరించుకోవాలంటూ... ఆలిండియా రోడ్డు ట్రాన్స్‌పోర్ట్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో జాతీయ రహదారి ఉత్తర బైపాస్‌లో శుక్రవారం నిరసన చేపట్టారు. సంఘం జిల్లా కార్యదర్శి జి.శ్రీనివాసులు మాట్లాడుతూ... రహదారుల అభివృద్ధి సెస్‌ పేరుతో ప్రతి లీటరు పెట్రోలుపై రూ.5, డీజిల్‌పై రూ.2 చొప్పున అదనంగా వసూలు చేస్తున్నారన్నారు. అలా సెస్‌ వసూలు చేశాకా... మళ్లీ టోల్‌ ఛార్జీలు వసూలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. నిర్దిష్ట కాలపరిమితి తర్వాత టోల్‌ ఛార్జీల వసూళ్లు నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. నిరసనలో సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కాలం సుబ్బారావు, నాయకులు తంబి శ్రీనివాసులు, కె.అంజిబాబు, ఎ.రాము, కోశాధికారి ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. నిరసన కారణంగా కొద్దిసేపు వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని