logo

రూ. 4.92 కోట్ల ఖర్చు.. రూ.2.21 కోట్ల జప్తు

ఎన్నిల కోడ్‌ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఈ నెల 26వ తేదీ వరకు జిల్లాలో రూ.2,21,90,514 విలువైన నగదు, మద్యం, డ్రగ్స్‌, ఓటర్లను ప్రభావితం చేసేలా పంచేందుకు సిద్ధం చేసినట్లుగా అనుమానిత వస్తువులను సీజ్‌ చేసినట్లు కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ తెలిపారు.

Published : 27 Apr 2024 06:07 IST

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: ఎన్నిల కోడ్‌ అమలులోకి వచ్చినప్పటి నుంచి ఈ నెల 26వ తేదీ వరకు జిల్లాలో రూ.2,21,90,514 విలువైన నగదు, మద్యం, డ్రగ్స్‌, ఓటర్లను ప్రభావితం చేసేలా పంచేందుకు సిద్ధం చేసినట్లుగా అనుమానిత వస్తువులను సీజ్‌ చేసినట్లు కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ తెలిపారు. ఒంగోలులో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మే 2న పరిశీలకులు, పోటీ చేసే అభ్యర్థుల సమక్షంలో రెండో విడత ఈవీఎంల ర్యాండమైజేషన్‌ నిర్వహించనున్నట్లు చెప్పారు. మే 3 నుంచి 7వ తేదీ వరకు రాజకీయ పార్టీల సమక్షంలో ఈవీఎంల కమిషనింగ్‌ ఉంటుందన్నారు. జిల్లాలో సీ-విజిల్‌ యాప్‌ ద్వారా 772 ఫిర్యాదులందాయని వచ్చాయని తెలిపారు. ప్రచారం నిమిత్తం వివిధ రాజకీయ పార్టీలు ఇప్పటివరకు రూ.4.92 కోట్ల మేర ఖర్చు చేసినట్లు గుర్తించామని, ఎన్నికల నిర్వహణ కోసం 14,306 మందికి విధులు కేటాయించినట్లు వివరించారు. ఇప్పటివరకు 62 మంది వాలంటీర్లను తొలగించగా, 2,714 మంది రాజీనామా చేసినట్లు తెలిపారు. సమావేశంలో డీఆర్వో శ్రీలత, స్వీప్‌ అధికారులు పాల్గొన్నారు. అనంతరం స్వీప్‌లో భాగంగా ఓటరు అవగాహన, ప్రచార పత్రాలను ఆవిష్కరించారు.

మల్లపాలెంలో రూ.20 లక్షల నగదు పట్టివేత...

 పుల్లలచెరువు న్యూస్‌టుడే: పుల్లలచెరువు మండలం మల్లపాలెం ప్రధాన రహదారి చెక్‌పోస్టు వద్ద శుక్రవారం సాయంత్రం రూ.20 లక్షల నగదును అధికారులు పట్టుకున్నారు. మాచర్ల నుంచి వై.పాలెం మీదుగా ఒంగోలు వెళ్లే వాహనాన్ని తనిఖీ చేయగా ఈ నగదు దొరికింది. ఈ విషయాన్ని ఆర్వో శ్రీలేఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తనిఖీల్లో ఎన్నికల ఎస్‌ఎస్‌టీ బృందం సభ్యులు, పుల్లలచెరువు ఎస్సై ఫిరోజ్‌ ఫాతిమా, సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు