logo

246మంది అభ్యర్థులు415నామినేషన్లు48తిరస్కరణలు

సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఒంగోలు పార్లమెంట్‌తో పాటు, జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు.

Published : 27 Apr 2024 06:05 IST

అభ్యర్థుల సమక్షంలో నామినేషన్‌ పత్రాలు పరిశీలిస్తున్న దర్శి ఆర్వో లోకేశ్వరరావు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల ప్రక్రియకు సంబంధించి ఒంగోలు పార్లమెంట్‌తో పాటు, జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలకు ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించారు. మొత్తం 246 మంది అభ్యర్థులు 415 దాఖలు చేశారు. సెంటిమెంట్లు, ముహూర్త బలాలంటూ ఈ సారి సెట్లను గణనీయంగా దాఖలు చేశారు. అభ్యర్థులతో పాటు, వారి సతీమణులు, కుటుంబ సభ్యులు.. ఇలా అన్ని నియోజకవర్గాల్లోనూ నాలుగు వరకు కూడా అందజేశారు. ఇప్పటివరకు అభ్యర్థితో పాటు, మరొకరు డమ్మీ సెట్‌ వేసేవారు. ఈ సారి అందుకు భిన్నంగా పలుచోట్ల అభ్యర్థులతో పాటు, వారి కుటుంబ సభ్యులు ఒకటికి మించి దాఖలు చేయడం గమనార్హం. పేరు బలాలు, ముహూర్తం ప్రకారం తొలుత సాదాసీదాగా.. ఆ తర్వాత మరోసారి శ్రేణులతో బల ప్రదర్శనగా వెళ్లి నామపత్రాలు వేశారు.

 పరిశీలన పూర్తి...: ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 206 మంది నామినేషన్లు దాఖలు చేయగా.. 48 అధికారులు తిరస్కరించారు. ఒంగోలు పార్లమెంట్‌, మిగతా అసెంబ్లీ నియోజకవర్గాల్లో సదరు ఆర్వోలు నామినేషన్‌ పత్రాలను పరిశీలించారు. ఒంగోలు పార్లమెంట్‌కు సంబంధించి కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ సమక్షంలో పరిశీలన సాగింది. ఎంపీ స్థానానికి 32 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా, ఏడు తిరస్కరణకు గురయ్యాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు