logo

పైసా విదిల్చింది లేదు

గిద్దలూరు నియోజకవర్గం అర్థవీడు మండల కేంద్రంలోని బాలుర గురుకుల మైదానంలో గత ప్రభుత్వ హయాంలో సుమారు రూ.కోటి నిధులతో మినీ ఇండోర్‌ స్టేడియం నిర్మాణ పనులను 2018లో చేపట్టింది.

Published : 27 Apr 2024 05:48 IST

 వైకాపా పాలనలో క్రీడాభివృద్ధి కుదేలు 

నిలిచిన ఇండోర్‌ స్టేడియం నిర్మాణ పనులు

గిద్దలూరు నియోజకవర్గం అర్థవీడు మండల కేంద్రంలోని బాలుర గురుకుల మైదానంలో గత ప్రభుత్వ హయాంలో సుమారు రూ.కోటి నిధులతో మినీ ఇండోర్‌ స్టేడియం నిర్మాణ పనులను 2018లో చేపట్టింది. నిర్మాణం పూర్తయితే మారుమూల ప్రాంతాల క్రీడాకారులకు అందుబాటులోకి వస్తుందని ఎందరో ఆశగా ఎదురు చూశారు. వైకాపా అధికారంలోకి వచ్చాక..నిధులు విడుదల చేయకపోవడంతో నిర్మాణ పనులు గోడలతోనే అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఈ అయిదేళ్లలో అధికార పార్టీ స్టేడియం నిర్మాణాకి పైసా విదల్చలేదు. దీంతో క్రీడా పోటీల నిర్వాహణకు ఇక్కడ అస్కారం లేకుండా పోయింది.

చాటు చేసి..మమ అనిపించారు..: అర్థవీడు బాలుర గురుకుల మైదానం వేదికగా 2022 అక్టోబర్‌ 21 నుంచి 23 వరకు రాష్ట్ర స్థాయి అండర్‌-14 రగ్బీ పోటీలను జిల్లా రగ్బీ సంఘం, గురుకుల పాఠశాల యాజమాన్యం సంయుక్తంగా నిర్వహించారు. క్రీడల అభివృద్ధికి జగన్‌ ప్రభుత్వం ఏదో చేస్తుందని..రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన క్రీడాకారుల ముందు వైకాపా నాయకులు డప్పు కొట్టారు. అయితే రగ్బీ పోటీలు జరుగుతున్న మైదానంలోనే నిధులు లేమితో నిలిచిన మినీ ఇండోర్‌ స్టేడియం కనపడుతున్నా దాని గురించి నోరెత్తేందుకు వీళ్లకు మనసు లేకుండా పోయింది. అంతేకాక స్టేడియం పూర్తిగా కనపడకుండా దాని చుట్టూ పరదాలు కట్టించి మరీ రగ్బీ పోటీల నిర్వాహణ చేయడం స్థానిక వైకాపా నాయకుల వంతైంది.

 అర్థవీడు, న్యూస్‌టుడే


మినీ స్టేడియం పూర్తయింటే..

అర్థవీడు గురుకుల మైదానంలో అర్ధాంతరంగా నిలిచిన ఇండోర్‌ మినీ స్టేడియం నిర్మాణం పూర్తయి ఉంటే క్రీడాకారులకు ఎంతో మేలు జరిగేది. అటవీ సమీప పల్లెల్లోని క్రీడాకారుల్లో మంచి నైపుణ్యం ఉన్నా..ఇక్కడ సరైన క్రీడా వసతులు లేకపోయాయి. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఇండోర్‌ స్టేడియం పనులకు వైకాపా ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా నిలిపి వేయడంతో ఉపయోగంలోకి రాకుండా పోయింది. నిర్మాణం పూర్తయి వాడులోకి వస్తే క్రీడాకారులకు మేలు జరిగేది..

 గోన రాజ్‌కుమార్‌, పాపినేనిపల్లి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని