logo

హెచ్చరిక.. కండువాలు మారిస్తే జరిమానా

ప్రస్తుతం ఎవరు ఏ పార్టీనో ఇతమిత్థంగా చెప్పలేం. ఈ రోజు ఉదయం ఒక రాజకీయ పార్టీ కండువా కప్పుకొంటే.. సాయంత్రానికే మరో పార్టీ పిలిచిందంటూ అక్కడ ప్రత్యక్షమవుతుంటారు.

Published : 27 Apr 2024 06:06 IST

ఒంగోలు, న్యూస్‌టుడే: ప్రస్తుతం ఎవరు ఏ పార్టీనో ఇతమిత్థంగా చెప్పలేం. ఈ రోజు ఉదయం ఒక రాజకీయ పార్టీ కండువా కప్పుకొంటే.. సాయంత్రానికే మరో పార్టీ పిలిచిందంటూ అక్కడ ప్రత్యక్షమవుతుంటారు. ఎన్నికల వేళ ఇలాంటి విచిత్రాలు తరచూ కనిపిస్తుంటాయి. ఈ నేపథ్యంలో కొన్నిసార్లు వివాదాలూ తలెత్తుతుంటాయి. ఈ నేపథ్యంలో కొత్తపట్నం మండలం మడనూరు పంచాయతీ పరిధిలోని స్వర్ణాంధ్ర పట్టపుపాలెం ఊరి పెద్దలు ఓ నిర్ణయం తీసుకున్నారు. ‘మీ ఓటు మీ ఇష్టం. నచ్చిన వాళ్లకు వేసుకుంటే లేదు మాకేం కష్టం... అభ్యంతరం. ఆ స్వేచ్ఛ అందరికీ ఉంది. ఊరి పెద్దలుగా మేమూ గౌరవిస్తాం. అంతే తప్ప పదేపదే పార్టీల కండువాలు మార్చి రచ్చ చేస్తామంటే ఊరుకోం. ఊరి పరువు బజారున పడేసేలా వ్యవహరిస్తే సహించం. రాజకీయ పార్టీలు వాళ్ల ప్రయోజనాల కోసం ఎన్నో ఎత్తులు వేస్తుంటాయి. నాయకులు జిత్తులు ప్రదర్శిస్తుంటారు. ఆ మాయలో పడొద్దు. మీ ఓటేదో మీరు వేసుకోండి. అలాకాకుండా పార్టీల కండువాలు పదే పదే వివాదాలు తెస్తే.. ఊళ్లో ప్రశాంత వాతావరణాన్ని కలుషితం చేస్తే మాత్రం ఊరుకోం. రూ.50 వేలు జరిమానా చెల్లించాల్సి వస్తుంది జాగ్రత్త’... అంటూ పెద్దలు తీర్మానించారు.


28 నుంచి ఓటర్లకు స్లిప్పులు

ఒంగోలు గ్రామీణం, న్యూస్‌టుడే: మే 13న నిర్వహించనున్న సార్వత్రిక ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా ఈ నెల 28 నుంచి జిల్లా వ్యాప్తంగా అన్ని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో బీఎల్వోలు ఇంటింటా ఓటరు స్లిప్పులు పంపిణీ చేయనున్నారు. ఈ నెల 15 వరకు ఓటర్ల చేర్పుల నిమిత్తం దరఖాస్తులు స్వీకరించారు. వీటిపై బీఎల్వోలు విచారణ ప్రక్రియ పూర్తి చేసి అరులైన వారికి ఓటు హక్కు కోసం సిఫార్సు చేశారు. తాజాగా విడుదలైన ఓటర్ల తుది జాబితా ఆధారంగా సీరియల్‌ నంబరు, పోలింగ్‌ కేంద్రం తదితర సమాచారంతో కూడిన స్లిప్పు అందజేస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని