logo

తెదేపా పాలనలోనే అభివృద్ధి

తెదేపా పాలనలోనే అభివృద్ధి జరిగిందని మాజీ ఎమ్మెల్యే, తెదేపా గిద్దలూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి ముత్తుముల అశోక్‌రెడ్డి పేర్కొన్నారు.. ఆయన శుక్రవారం గిద్దలూరు నగర పంచాయతీలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు.

Published : 27 Apr 2024 05:46 IST

తెదేపాలో చేరిన వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానిస్తున్న తెదేపా అభ్యర్థి ముత్తుముల అశోక్‌రెడ్డి

గిద్దలూరు పట్టణం, కంభం, పొదిలి గ్రామీణం, యర్రగొండపాలెం పట్టణం, తర్లుపాడు, మార్కాపురం గ్రామీణం, న్యూస్‌టుడే : తెదేపా పాలనలోనే అభివృద్ధి జరిగిందని మాజీ ఎమ్మెల్యే, తెదేపా గిద్దలూరు నియోజకవర్గ తెదేపా అభ్యర్థి ముత్తుముల అశోక్‌రెడ్డి పేర్కొన్నారు.. ఆయన శుక్రవారం గిద్దలూరు నగర పంచాయతీలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిద్దలూరు నియోజకవర్గ వైకాపా కో కన్వినర్‌ తిప్పిశెట్టి రజనీకాంత్‌ అశోక్‌రెడ్డి సమక్షంలో తెదేపాలో చేరారు. ఆయనతో పాటు 20 కుటుంబాలు వైకాపాను వీడి తెదేపా తీర్థం పుచ్చుకున్నారు.

  •   ‌్ర ముత్తుముల అశోక్‌రెడ్డి సోదరుడు జగన్‌ శుక్రవారం కంభం పట్టణంలో ప్రచారం నిర్వహించారు. ‌
  •   మార్కాపురం తెదేపా అభ్యర్ధి కందుల నారాయణరెడ్డి కుమారై నందినిరెడ్డి, సోదరుడు వేణుగోపాల్‌రెడ్డి శుక్రవారం కొనకనమిట్ట మండలంలోని మునగపాడు ఇంటింటి ప్రచారం చేపట్టారు.‌
  • మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సతీమణి వసంతలక్ష్మీ మార్కాపురం పట్టణంలోని 1వ వార్డులో శుక్రవారం రాత్రి ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చేరికల వెల్లువ
  •  పొదిలి మండలంలోని టి.సళ్లూరులో పది ఎస్సీ కుటుంబాలు కందుల విగ్నేష్‌రెడ్డి సమక్షంలో తెదేపాలో చేరారు.‌
  •   వై.పాలెం మండలం కొలుకుల గంజివాపరిపల్లె గ్రామాలకు చెందిన 40 కుటుంబాల వారు ఎరిక్షన్‌బాబు సమక్షంలో శుక్రవారం వైకాపా నుంచి తెదేపాలో చేరాయి.‌
  • తర్లుపాడు మండలంలోని కారుమానుపల్లె, మీర్జాపేట, గొల్లపల్లె, రోలుగుంపాడు, నాగెళ్లముడుపు, తాడివారిపల్లె గ్రామాల్లో శుక్రవారం కందుల నారాయణరెడ్డి ప్రచార రథయాత్రలో ప్రచారం నిర్వహించారు. ‌
  • మార్కాపురం మండలంలోని ఇడుపూరు గ్రామంలో కందుల రోహిత్‌రెడ్డి ప్రచారం నిర్వహించారు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు