logo

పడుతూ లేస్తూ పది ఫలితాలు

పదో తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లా గత అయిదేళ్లుగా పడుతూ లేస్తూ వస్తోంది. ఈ ఏడాది రాష్ట్రంలో ఏడో స్థానంలో నిలిచింది. గత సంవత్సరం 73.74 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. ప్రస్తుతం ఆ శాతం 91.21 శాతం ఉత్తీర్ణత సాధించారు.

Published : 23 Apr 2024 05:07 IST

 ఈ ఏడాది 91.21 శాతం ఉత్తీర్ణత 

ఒంగోలు నగరం, న్యూస్‌టుడే: పదో తరగతి పరీక్షా ఫలితాల్లో జిల్లా గత అయిదేళ్లుగా పడుతూ లేస్తూ వస్తోంది. ఈ ఏడాది రాష్ట్రంలో ఏడో స్థానంలో నిలిచింది. గత సంవత్సరం 73.74 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా.. ప్రస్తుతం ఆ శాతం 91.21 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలురు 14,684 మంది పరీక్ష రాయగా 13,208 మంది(89.95 శాతం), బాలికలు 14,511 మంది పరీక్షలకు హాజరవ్వగా 13,422 మంది(92.05 శాతం) ఉత్తీర్ణత సాధించారు. మొత్తం మీద 29,195 మందిలో 26,630 మంది గండం నుంచి గట్టెక్కారు. వీరిలో 21,316 మంది ప్రథమ, 3,618 మంది ద్వితీయ, 1,696 మంది తృతీయ స్థానాల్లో నిలిచారు. ఉత్తమ ఫలితాలు సాధించినందుకు డీఈవో డి.సుభద్ర ఉపాధ్యాయులను అభినందించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని