logo

ఓట్లు దండుకునేందుకు వైకాపా కుట్ర

యువతను మత్తుకు బానిస చేసి ఓట్లు దండుకునేందుకు వైకాపా కుట్ర చేస్తోందని, దీన్ని అంతా సమర్థంగా తిప్పికొట్టాలని తెలుగునాడు విద్యార్థి సమాఖ్య(టీఎన్‌ఎస్‌ఎఫ్‌) జిల్లా అధ్యక్షుడు బలగ ప్రహర్ష పిలుపునిచ్చారు.

Published : 28 Mar 2024 05:17 IST

ప్రసంగిస్తున్న బలగ ప్రహర్ష, చిత్రంలో టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు

గుజరాతీపేట(శ్రీకాకుళం), న్యూస్‌టుడే: యువతను మత్తుకు బానిస చేసి ఓట్లు దండుకునేందుకు వైకాపా కుట్ర చేస్తోందని, దీన్ని అంతా సమర్థంగా తిప్పికొట్టాలని తెలుగునాడు విద్యార్థి సమాఖ్య(టీఎన్‌ఎస్‌ఎఫ్‌) జిల్లా అధ్యక్షుడు బలగ ప్రహర్ష పిలుపునిచ్చారు. శ్రీకాకుళం నగరంలోని తెదేపా జిల్లా కార్యాలయంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గంజాయి, డ్రగ్స్‌ విచ్చలవిడిగా దొరుకుతున్నాయని, కళాశాల విద్యార్థులు వీటికి బానిసలవుతున్నారని ఆరోపించారు. అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉండే ఆంధ్రప్రదేశ్‌.. నేడు డ్రగ్స్‌ వినియోగంలో అగ్రస్థానానికి చేరుకుందని విమర్శించారు. ఇప్పటికైనా యువత మేల్కొని వైకాపా ప్రభుత్వాన్ని సాగనంపాలని కోరారు. అనంతరం గోడపత్రికను ఆవిష్కరించారు. టీఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి సుమంత్‌గుర్రాల, ఉపాధ్యక్షులు బి.సంతోష్‌, నియోజకవర్గ అధ్యక్షుడు రెడ్డి గిరిజాశంకర్‌, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని