logo
Updated : 19 Jan 2022 08:22 IST

Kamal Haasan: కమల్‌హాసన్‌ డిశ్ఛార్జి.. ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యుల ధ్రువీకరణ

కోడంబాక్కం, న్యూస్‌టుడే: వైద్య పరీక్షల కోసం ఆస్పత్రిలో చేరిన విశ్వనటుడు కమల్‌హాసన్‌ మంగళవారం డిశ్ఛార్జి అయ్యారు. కరోనా నుంచి కోలుకున్న కమల్‌ వైద్య పరీక్షల కోసం సోమవారం పోరూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనకు పూర్తి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు ధ్రువీకరించిన తర్వాత మంగళవారం ఉదయం డిశ్ఛార్జి అయ్యారు. మరోవైపు లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో కమల్‌ నటిస్తున్న ‘విక్రం’ సినిమా చిత్రీకరణ పనులు కూడా ఆఖరిదశకు చేరుకున్నాయి. ఈ సినిమా పనులపై కమల్‌ ప్రస్తుతం దృష్టి పెట్టారు. ఇందులో విజయ్‌సేతుపతి విలన్‌గా నటిస్తున్నారు.

Read latest Tamilnadu News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని