logo

చిన్ననాటి నుంచే ఆటలకు ప్రాధాన్యం అవసరం

రాష్ట్రంలో చిన్నతనం నుంచే క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారుడు శరత్‌కమల్‌ తెలిపారు. ఇంగ్లండ్‌లో జరిగిన కామన్‌వెల్త్‌ పోటీల్లో పతకాలు సాధించిన ఆయన విమానంలో దిల్లీ నుంచి చెన్నైకి వచ్చారు.

Published : 12 Aug 2022 00:32 IST

సాధించిన పతకాలతో శరత్‌కమల్‌

సైదాపేట, న్యూస్‌టుడే: రాష్ట్రంలో చిన్నతనం నుంచే క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని టేబుల్‌ టెన్నిస్‌ క్రీడాకారుడు శరత్‌కమల్‌ తెలిపారు. ఇంగ్లండ్‌లో జరిగిన కామన్‌వెల్త్‌ పోటీల్లో పతకాలు సాధించిన ఆయన విమానంలో దిల్లీ నుంచి చెన్నైకి వచ్చారు. విమానాశ్రయంలో క్రీడాభివృద్ధి కమిషన్‌, అభిమానులు, ఆయన చదివిన పాఠశాల నిర్వాహకులు, కుటుంబ సభ్యులు, స్నేహితులు స్వాగతం పలికారు. తర్వాత శరత్‌కమల్‌ విలేకర్లతో మాట్లాడుతూ... సెమీ ఫైనల్‌ తర్వాత చాలా నమ్మకంతో ఆడానని తెలిపారు. మ్యాచ్‌ కఠినంగా ప్రారంభమై చక్కగా ముగిసిందన్నారు. 2006లో రెండు పసిడి పతకాలు సాధించానని, ఈ సారి మూడు కైవసం చేసుకోవడంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పోటీలు తన జీవితంలో ముఖ్యమైనవని తెలిపాడు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని, చిన్నప్పటి నుంచే నేర్చుకునేందుకు విద్యార్థుల కోసం ఏర్పాట్లు చేయాలని కోరారు. చిన్న వయస్సు నుంచి తనతో ఉన్నవారంతా బాగా అడే నైపుణ్యం ఉన్నవారేనని, అయితే వారు చదువుపై దృష్టి పెట్టడంతో ఆట కొనసాగించలేక పోయారని చెప్పారు. చిన్నతనం కంటే వయస్సు పెరిగే కొద్ది బాగా అడుతున్నానని తెలిపాడు. రానున్న అంతర్జాతీయ పోటీల్లో కూడా పాల్గొని దేశానికి పతకాలు సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని