logo

పోలీసు వ్యానులో రీల్స్‌

పాతచాకలిపేటలో పోలీసు వ్యానులో మారణాయుధాలతో ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ పోస్టు చేసిన కళాశాల విద్యార్థి సహా ఇద్దరిని అరెస్టు చేశారు.

Updated : 13 Aug 2022 06:36 IST

విద్యార్థి సహా ఇద్దరి అరెస్టు

చెన్నై (క్రైం), న్యూస్‌టుడే: పాతచాకలిపేటలో పోలీసు వ్యానులో మారణాయుధాలతో ఇన్‌స్టాగ్రామ్‌ రీల్స్‌ పోస్టు చేసిన కళాశాల విద్యార్థి సహా ఇద్దరిని అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు... మద్రాసు హైకోర్టులో భద్రతా విధుల్లో ఉన్న ప్రత్యేక దళ పోలీసులు కొత్తచాకలిపేట పోర్ట్‌ అథారిటీ కార్పొరేషన్‌ నివాసంలో బస చేస్తున్నారు. పోలీసు డ్రైవర్‌గా పనిచేస్తున్న నవీన్‌కుమార్‌ అక్కడ వ్యాను ఆపారు. నలుగురు యువకులు వ్యానులో మారణాయుధాలతో వీడియో తీసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. డ్రైవర్‌ ఫిర్యాదు మేరకు కొత్తచాకలిపేట పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. సంజు అఫీషియల్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ఐడీని గుర్తించారు. కొత్తచాకలిపేటకు చెందిన అంబేడ్కర్‌ న్యాయ కళాశాల విద్యార్థి విఘ్నేష్‌, మణలి పుదునగం కి చెందిన ఫొటోగ్రాఫర్‌ సంజయ్‌ని అరెస్టు చేశారు. కోర్టులో హాజరుపరిచాక జైలుకు తరలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని