logo

సబ్‌వేలలో సిద్ధంగా మోటారు పంపులు

వర్షపు నీటి ప్రవాహం, వరదలు నియంత్రించేందుకు నగరంలోని సబ్‌వేలున్న ప్రాంతాల్లో చెన్నై మహానగర కార్పొరేషన్‌ పనులు పూర్తి చేసింది. 16 సబ్‌వేలకు మరమ్మతులు చేసి అదనంగా 16 సబ్‌మెర్సిబుల్‌ మోటార్లను సిద్ధంగా ఉంచింది.

Published : 26 Sep 2022 02:07 IST

వడపళని, న్యూస్‌టుడే: వర్షపు నీటి ప్రవాహం, వరదలు నియంత్రించేందుకు నగరంలోని సబ్‌వేలున్న ప్రాంతాల్లో చెన్నై మహానగర కార్పొరేషన్‌ పనులు పూర్తి చేసింది. 16 సబ్‌వేలకు మరమ్మతులు చేసి అదనంగా 16 సబ్‌మెర్సిబుల్‌ మోటార్లను సిద్ధంగా ఉంచింది. వీటితో పాటు  113 పంపుసెట్లకు గాను 41 వరకు ఏర్పాటు చేశారు. ఎక్కువ భాగం మోటార్లు రంగరాజపురం, మ్యాడ్లీ రోడ్డు, దురైస్వామి సబ్‌వే, జోన్స్‌ రోడ్డు, బజార్‌ రోడ్డు, మ్యాడ్లీ రోడ్డు సబ్‌వేలలో 14 మోటార్లను సిద్ధం చేసినట్టు అధికారులు చెప్పారు. అదనంగా మరో ఏడు మోటార్లు రానున్నాయి.  దురైస్వామి సబ్‌వేకి ఏడు పంపులున్నాయని, అవికాకుండా మరో నాలుగు సబ్‌మెర్సిబుల్‌ మోటార్లు తెప్పిస్తున్నామని చెప్పారు. రాయపురం జోన్‌లోని స్టాన్లీ సబ్‌వేకి రెండు అదనపు పంపు సెట్లు,  ఆర్బీఐ సబ్‌వేకి 3, గెంగురెడ్డి సబ్‌వేకి 2, పెరంబూరు సబ్‌వేలో ఒకటి, గణేశపురం సబ్‌వేలో 4,  విల్లివాక్కంలో ఒకటి, హారింగ్‌టన్‌ రోడ్డు సబ్‌వేకి 2, నుంగంబాక్కం సబ్‌వేకి ఒకటి, రంగరాజపురం సబ్‌వేలో నాలుగు పంపుసెట్లను అమర్చారు. తిరువొత్తియూరులోని మాణిక్యం నగర్‌ సబ్‌వే కోసం మూడు పంపు సెట్లు సిద్ధం చేశారు. పెరంబూరు సబ్‌వే వద్ద రైల్వే శాఖ మరమ్మతులు చేపడుతోందని త్వరలోనే పూర్తవుతాయన్నారు. సింగార చెన్నై 2.0 పథకంలో భాగంగా కార్పొరేషన్‌ 91 శాతం మేరకు పనులు పూర్తి చేసినట్టు అధికారులు చెప్పారు. హబిబుల్లా రోడ్డు, సీతమ్మాళ్‌ కాలనీ, అంబేడ్కర్‌ కాలేజ్‌ రోడ్డు, మునుస్వామి సాలై, రాజమన్నార్‌ సాలైలో చాలావరకు రోడ్ల పనులు పూర్తయ్యాయి. అక్కడక్కడా పనులు మిగిలిపోయిన ప్రాంతాల్లో కూడా త్వరలోనే పూర్తి చేస్తామని అధికారులు పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని