logo

కుమార్తె చికిత్స కోసం వెళ్తుండగా..

హొసకోటె మైలాపుర గేటు వద్ద ఆదివారం అర్ధరాత్రి సంభవించిన రోడ్డు ప్రమాదంలో రాణిపేట జిల్లాకు చెందిన బాలమురుగన్‌ (45), సెల్వి (36) దంపతులు మరణించారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు.

Published : 04 Oct 2022 04:10 IST

రోడ్డు ప్రమాదంలో దంపతుల దుర్మరణం
బాలికకు తీవ్రగాయాలు

ఘటనా స్థలంలో నుజ్జయిన వాహనాలు

బెంగళూరు (గ్రామీణం), న్యూస్‌టుడే: హొసకోటె మైలాపుర గేటు వద్ద ఆదివారం అర్ధరాత్రి సంభవించిన రోడ్డు ప్రమాదంలో రాణిపేట జిల్లాకు చెందిన బాలమురుగన్‌ (45), సెల్వి (36) దంపతులు మరణించారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. ఇందులో బాలమురుగన్‌ దంపతుల నాలుగేళ్ల పాప కూడా ఉంది. మురుగున్‌ దంపతుల కుమార్తెకు ప్రాణాంతక వ్యాధి ఉంది. చికిత్సకు బెంగళూరులోని ఎంఎస్‌ విద్యా సంస్థ రూ. కోటి ఆర్థిక సాయాన్ని అందించింది. పాపకు చికిత్స చేయించేందుకు బెంగళూరుకు వస్తున్న సమయంలో దంపతులు ఇద్దరూ దుర్మరణం పాలయ్యారని గుర్తించారు. బాధితులకు స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందించి, మెరుగైన చికిత్సకు బెంగళూరులోని మణిపాల్‌ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం అనంతరం డ్రైవరు బస్సు వదిలి పరారయ్యాడు. రాణిపేట జిల్లాకు చెందిన దంపతులు తమ కుమార్తెతో ఆంధ్రాలోని చిత్తూరు జిల్లా బలిజఖండ్రిగ నుంచి ఆదివారం రాత్రి 9.30కి బయలుదేరిన కేఎస్‌ఆర్టీసీ బస్సు మైలాపుర గేటు వద్ద రహదారి పక్కన రాళ్ల లోడుతో నిలిపి ఉంచిన లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. ప్రమాదంలో బస్సు ఒక వైపు పూర్తిగా ధ్వంసమైంది. ప్రమాదానికి డ్రైవరు నిర్లక్ష్యమే కారణమని గుర్తించామని బెంగళూరు గ్రామీణ జిల్లా ఎస్పీ మలికార్జున బాలదండి తెలిపారు. హొసకోట ఠాణా ఇన్‌స్పెక్టర్‌ మంజునాథతో కలిసి ఆయన సంఘటన స్థలాన్ని పరిశీలించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని