logo

కనులపండువగా ప్రదోషోత్సవం

తిరువణ్ణామలై అరుణాచలేశ్వరస్వామి ఆలయంలో పంగుణి నెల ప్రదోషోత్సవం సోమవారం వైభవంగా జరిగింది. వేకువజామున ఆలయంలోని మూలవర్లకు సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాలు, అలంకరణ, దీపారాధనలు జరిగాయి.

Updated : 21 Mar 2023 06:35 IST

తిరువణ్ణామలై, న్యూస్‌టుడే: తిరువణ్ణామలై అరుణాచలేశ్వరస్వామి ఆలయంలో పంగుణి నెల ప్రదోషోత్సవం సోమవారం వైభవంగా జరిగింది. వేకువజామున ఆలయంలోని మూలవర్లకు సుగంధ ద్రవ్యాలతో ప్రత్యేక అభిషేకాలు, అలంకరణ, దీపారాధనలు జరిగాయి. సాయంత్రం ఐదో ప్రహారంలోని పెద్ద నందితో సహా అన్ని నంది విగ్రహాలకు ప్రత్యేక అభిషేకాలు, అలంకరణ, దీపారాధనలు చేశారు. ఉత్సవమూర్తులైన ఉన్నాములై సమేత చంద్రశేఖరస్వామిని ప్రత్యేకంగా అలంకరించి బంగారు వృషభ వాహనంలో ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు.
పళ్లిపట్టులో..
పళ్లిపట్టు పార్వతి సమేత సంఘమేశ్వరస్వామి ఆలయ ప్రదోషోత్సవం అతి వైభవంగా జరిగింది. ఉదయం మూలవర్లకు, సాయంత్రం నంది విగ్రహాలకు ప్రత్యేక అభిషేకాలు, అలంకరణ, దీపారాధనలు జరిగాయి. సాయంత్రం ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించి ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు.
అలంకరణలో సంగమేశ్వరస్వామి, వృషభ వాహనంపై ఊరేగుతున్న చంద్రశేఖరస్వామి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని