logo

కొడైక్కానల్‌లో అభివృద్ధి పనులు

దిండిగల్లు జిల్లా కొడైక్కానల్‌లో పర్యాటకులను ఆకట్టుకునే విధంగా కోట్లాది రూపాయలతో పలు అభివృద్ధి పనులు జరుపుతున్నారు.

Updated : 30 Mar 2023 06:14 IST

నక్షత్ర చెరువులో ఏర్పాటు చేసిన ఫౌంటేన్‌

విల్లివాక్కం, న్యూస్‌టుడే:దిండిగల్లు జిల్లా కొడైక్కానల్‌లో పర్యాటకులను ఆకట్టుకునే విధంగా కోట్లాది రూపాయలతో పలు అభివృద్ధి పనులు జరుపుతున్నారు. నేపథ్యంల వచ్చే నెల వేసవి ఉత్సవం, పుష్ప ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో నక్షత్ర చెరువులో సుమారు రూ.24 కోట్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నారు. చెరువుచుట్టు కాలినడక బాట పునరుద్ధరించి విద్యుద్దీపాలు అమరుస్తున్నారు. పడవ షికారుకు 75 పడవలను కొనుగోలు చేస్తున్నారు. నీటిని శుభ్రం చేసి పైన ఫౌంటేన్లను ఏర్పాటు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని