ప్రభుత్వ పాఠశాలల్లో 11 లక్షల మంది చేరిక
తంజావూర్ జిల్లా పాఠశాల విద్యాశాఖ తరఫున ఉత్తమంగా విధులు నిర్వహించిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు పురస్కారాలు ప్రదానం చేసే కార్యక్రమం శుక్రవారం జరిగింది.
మంత్రి అన్బిల్ మహేశ్
పురస్కారం అందజేస్తున్న అన్బిల్ మహేశ్
ఆర్కేనగర్, న్యూస్‌టుడే: తంజావూర్ జిల్లా పాఠశాల విద్యాశాఖ తరఫున ఉత్తమంగా విధులు నిర్వహించిన ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు పురస్కారాలు ప్రదానం చేసే కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఇందులో పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్ మహేశ్ పొయ్యామొళి పాల్గొని 150 మంది ఉపాధ్యాయులకు పురస్కారాలు అందజేశారు. 100 శాతం ఉత్తీర్ణత అందించిన 1,700 మంది ఉపాధ్యాయులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఉత్తమంగా పనిచేసిన పాఠశాల నిర్వహణ కమిటీలను అవార్డులతో గౌరవించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.... ప్రభుత్వ పాఠశాలల్లో ఇంకా ఉత్తీర్ణత శాతం పెంచాలని సూచించారు. అధికారులు ప్రైవేట్ పాఠశాలల బస్సులను తనిఖీ చేయాలని చెప్పారు. ఉపాధ్యాయుల కొరత కేవలం పాఠశాల విద్యాశాఖకు పరిమితం కాదన్నారు. సీనియారిటీ లేదా మెరిట్‌ను బట్టి నియామకాలు జరపాలనేదానిపై సుప్రీం కోర్టులో విచారణ సాగుతోందన్నారు. ప్రధానోపాధ్యాయులకు అదనంగా బాధ్యతలు అప్పగించి పనిచేయిస్తున్నట్లు తెలిపారు. మే నెలలోనే 80 శాతం మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చేరినట్లు చెప్పారు. రెండేళ్లలో 11 లక్షల మంది చేరినట్లు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Intresting News today: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Damini bhatla: ఊహించని ట్విస్ట్.. బిగ్‌బాస్ నుంచి సింగర్ దామిని ఎలిమినేట్
-
Sudhamurthy: నా పేరును దుర్వినియోగం చేస్తున్నారు.. పోలీసులకు సుధామూర్తి ఫిర్యాదు
-
Raghava Lawrence: ఆయన లేకపోతే ఈ వేదికపై ఉండేవాణ్ని కాదు: లారెన్స్
-
Mla Rajaiah: కాలం నిర్ణయిస్తే బరిలో ఉంటా: ఎమ్మెల్యే రాజయ్య
-
Khammam: ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. కళాశాల వద్ద ఉద్రిక్తత