logo

చెన్నై సహా ఐదుచోట్ల ఎన్‌ఐఏ సోదాలు

బెంగళూరులో బాంబు దాడి వ్యవహారమై రాష్ట్రంలో ఐదుచోట్ల ఎన్‌ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. ఘటనతో సంబంధం ఉన్న ఇద్దరు నిందితులు చెన్నై ట్రిప్లికేన్‌లో నెల రోజులకి పైగా ఉండి కుట్ర పన్నిన నేపథ్యంలో ఎన్‌ఐఏ అధికారులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

Published : 28 Mar 2024 00:15 IST

షేక్‌ దావూద్‌ ఇంట్లో పోలీసు భద్రత మధ్య సోదాలు చేస్తున్న ఎన్‌ఐఏ అధికారులు

ప్యారిస్‌, న్యూస్‌టుడే: బెంగళూరులో బాంబు దాడి వ్యవహారమై రాష్ట్రంలో ఐదుచోట్ల ఎన్‌ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. ఘటనతో సంబంధం ఉన్న ఇద్దరు నిందితులు చెన్నై ట్రిప్లికేన్‌లో నెల రోజులకి పైగా ఉండి కుట్ర పన్నిన నేపథ్యంలో ఎన్‌ఐఏ అధికారులు పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు చెన్నైలో పలు ప్రాంతాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ విషయమై 1000 సీసీ కెమెరాల ఫుటేజీలు పరిశీలించి, వారిద్దరికి ఎవరెవరితో సంబంధం ఉందనే విషయమై ఆరా తీస్తున్నారు. చెన్నై మన్నడి వినాయగర్‌ కోవిల్‌ వీధిలో, మన్నడి మూట్టైక్కారన్‌ వీధిలో, ట్రిప్లికేన్‌ లాడ్జిలో బుధవారం సోదాలు చేపట్టారు. రామనాథపురం జిల్లా దేవీపట్టినంలో ఉంటున్న షేక్‌ దావూద్‌, అతని తండ్రి ఇళ్లలో తనిఖీలు చేశారు. షేక్‌ దావూద్‌పై 2018, 2020లో ఆయుధాలతో ఉన్నట్లు, నిషేధిత సంస్థలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు, ఆ సంస్థలకు నగదు బదిలీ, యువకులకు బ్రెయిన్‌ వాష్‌చేసి శిక్షణ ఇవ్వడం తదితర కేసులు నమోదయ్యాయి. బెంగళూరు బాంబు పేలుడు నిందితులకు ఆశ్రయం ఇచ్చి ఉంటారన్న అనుమానంతో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. ఆయన ఇంట్లో గత నాలుగేళ్లలో ఎన్‌ఐఏ అధికారులు మూడుసార్లు సోదాలు చేపట్టారు. కన్యాకుమారి జిల్లా మార్తాండంలో అద్దెకు ఉంటున్న రాజాముత్తు అనే వ్యక్తి ఇంట్లోనూ తనిఖీలు చేశారు. బాంబుపేలుడు ఘటనలో సంబంధం ఉన్న నిందితులకు సాయం చేసిన వారిని గురిం్తచేందుకు ఈ సోదాలు జరిగాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని