logo

ఇండియా కూటమిలో డీఎంకే ఉండి ప్రయోజనమేంటి?

డీఎంకే ఇండియా కూటమిలో ఉన్నా రాష్ట్రానికి ప్రయోజనమేమి లేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి అన్నారు.

Published : 07 May 2024 00:06 IST

ఎడప్పాడి

సైదాపేట, న్యూస్‌టుడే: డీఎంకే ఇండియా కూటమిలో ఉన్నా రాష్ట్రానికి ప్రయోజనమేమి లేదని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిసామి అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే, భాజపా కూటమి ఏర్పాటు చేయకపోయినా రెండు పార్టీలు తెరవెనుక నాటకాలు ఆడుతున్నాయని డీఎంకే ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో ఎడప్పాడి పళనిసామి విలేకర్లతో మాట్లాడుతూ... డీఎంకే భాగస్వామిగా ఉన్న ఇండియా కూటమిలో ముఖ్య పార్టీ అయిన కాంగ్రెస్‌ కర్ణాటకలో అధికారంలో ఉందని, అయినా తమిళనాడుకు రావాల్సిన నీటిని ఇచ్చేందుకు నిరాకరిస్తుందని తెలిపారు. తమిళనాడు హక్కలను అడిగి పొందలేని ఇండియా కూటమిలో డీఎంకే ఉండి ప్రయోజనమేంటని ప్రశ్నించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని