logo

వైద్య విద్యార్థుల మృతికి సీఎం సంతాపం

కన్నియాకుమరి జిల్లా రాజాక్కమంగలంలోని సముద్రంలో మునిగి మృతి చెందిన వైద్య విద్యార్థుల ఘటనపై ముఖ్యమంత్రి స్టాలిన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Published : 07 May 2024 00:09 IST

సముద్రతీరం వద్ద మృతుల చెప్పులు

చెన్నై, న్యూస్‌టుడే: కన్నియాకుమరి జిల్లా రాజాక్కమంగలంలోని సముద్రంలో మునిగి మృతి చెందిన వైద్య విద్యార్థుల ఘటనపై ముఖ్యమంత్రి స్టాలిన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భవిష్యత్తులో వైద్యసేవలు అందించాల్సిన విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం వైద్య రంగానికి మాత్రమే కాకుండా రాష్ట్రానికి పెను నష్టమన్నారు. క్షతగాత్రులకు తగిన చికిత్స అందించాలని కలెక్టరును ఆదేశించినట్లు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు, బంధువులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. బాధిత కుటుంబాలకు అవసరమైన ప్రభుత్వ సాయాన్ని ఎన్నికల కమిషన్‌ అనుమతితో అందించనున్నట్లు పేర్కొన్నారు.

లేమూర్‌ బీచ్‌ వద్ద ప్రమాద హెచ్చరికగా ఎర్ర దుస్తులు కడుతున్న కార్పొరేషన్‌ సిబ్బంది

భద్రతా విధుల్లో పోలీసులు

ఫ్లెక్సీలు కట్టి ప్రవేశమార్గాన్ని మూసేసిన దృశ్యం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని