logo

ఆహారశాలే!!

ఆహారశాలలు సరికొత్త రూపు సంతరించుకొని వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఎప్పటికప్పుడు నవ్య రీతులతో పోటీ పడుతున్నాయి. ఇలాంటి వాతావరణం విశాఖలో సరికొత్త ఆహ్లాదాన్ని చేరువ

Published : 22 Jan 2022 02:48 IST

ఆహారశాలలు సరికొత్త రూపు సంతరించుకొని వినియోగదారులను ఆకట్టుకుంటున్నాయి. ఎప్పటికప్పుడు నవ్య రీతులతో పోటీ పడుతున్నాయి. ఇలాంటి వాతావరణం విశాఖలో సరికొత్త ఆహ్లాదాన్ని చేరువ చేస్తోంది. అందుకు ఉదాహరణే జీవీఎంసీ సమీప ప్రాంతంలోని ఓ హోటల్‌. భోజన ప్రియులు లోపలికి రాగానే రైలు నిలయంలోకి అడుగుపెట్టిన అనుభూతి కలిగే ఏర్పాట్లు చేశారు. అంతే కాదు..అక్కడ చిన్నచిన్న రైళ్లు కూతలు పెడుతూ... ఏ టేబుల్‌ వద్ద ఆహారం అందించాలో అక్కడకొచ్చి ఆగి మళ్లీ వెనక్కి వెళ్లిపోతుంటాయి. అంతేకాదు..ఉత్తరాంధ్ర విశేషాలు తెలిపేలా చిత్రాలను ప్రత్యేక రీతుల్లో తయారు చేయించారు.

-ఈనాడు, విశాఖపట్నం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని