logo

కూటమి గెలుపుతోనే భవన నిర్మాణ కార్మికులకు మేలు

కూటమి ప్రభుత్వం కొలువుదీరితే భవన నిర్మాణ కార్మికులకు మంచి రోజులు వస్తామని కూటమి అనకాపల్లి పార్లమెంట్‌ అభ్యర్థి సీఎం రమేశ్‌ అన్నారు. అనకాపల్లి సర్వకామదాంబ పార్కు వద్ద శనివారం భవన నిర్మాణ కార్మికులతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

Published : 05 May 2024 03:44 IST

భవన నిర్మాణ కార్మికులతో కలసి ఫలహారం తింటున్న సీఎం రమేశ్‌

అనకాపల్లి పట్టణం, న్యూస్‌టుడే: కూటమి ప్రభుత్వం కొలువుదీరితే భవన నిర్మాణ కార్మికులకు మంచి రోజులు వస్తామని కూటమి అనకాపల్లి పార్లమెంట్‌ అభ్యర్థి సీఎం రమేశ్‌ అన్నారు. అనకాపల్లి సర్వకామదాంబ పార్కు వద్ద శనివారం భవన నిర్మాణ కార్మికులతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వీరితో కలసి సీఎం రమేశ్‌ ఫలహారం తిన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైకాపా పాలనలో ఎక్కువగా నష్టపోయింది భవన నిర్మాణ కార్మికులేనని తెలిపారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధిని పక్కదారి పట్టించారన్నారు. రాష్ట్రంలో ఇసుక దొరక్కుండా చేసిన కార్మికుల పొట్ట కొట్టారన్నారు. జగన్‌కు సొంతంగా సిమెంట్ కర్మాగారం ఉండడంతో వీటి ధరలపై నియంత్రణ లేకుండా చేశారన్నారు. ఇసుక, సిమెంట్ ధరలను పెంచి సామాన్యుడు ఇల్లు కట్టుకోలేని విధంగా చేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సిమెంట్‌, ఇసుక ధరలను నియంత్రిస్తామని, భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నిధి నిధులు రూ. 450 కోట్లు ఏమయ్యాయో విచారణ చేపడతామని పేర్కొన్నారు. పనుల కోసం వచ్చేవారు వేచి ఉండేందుకు వీలుగా సామాజిక భవనాన్ని నిర్మించాలని కార్మికులు కోరారు. కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి దాడి రత్నాకర్‌, మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని