logo

చందనోత్సవం భక్తులకు మెరుగైన సదుపాయాలు

ఈనెల 10వ తేదీన సింహగిరిపై జరగనున్న చందనోత్సవం సందర్భంగా అప్పన్న స్వామి నిజరూప దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి కరికల్‌ వలవన్‌ సూచించారు.

Published : 07 May 2024 04:24 IST

కప్పస్తంభం వద్ద కరికల్‌ వలవన్‌

సింహాచలం, న్యూస్‌టుడే: ఈనెల 10వ తేదీన సింహగిరిపై జరగనున్న చందనోత్సవం సందర్భంగా అప్పన్న స్వామి నిజరూప దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి కరికల్‌ వలవన్‌ సూచించారు. సోమవారం ఆయన సింహగిరిపై కలెక్టర్‌ మల్లికార్జున, జీవీఎంసీ కమిషనర్‌ సాయికాంత్‌వర్మ, ఈవో సింగల శ్రీనివాసమూర్తితో ఏర్పాట్లపై సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి భక్తుడికి సులువుగా స్వామి నిజరూప దర్శనం లభించేలా చూడాలన్నారు. గతంలో జరిగిన పొరపాట్లను అధిగమిస్తూ ఆయా లోపాలను సవరించుకోవాలని ఆదేశించారు. అధికారులు ఇప్పటికే చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. తొలుత ఆయన అప్పన్న స్వామిని దర్శించుకుని పూజల్లో పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని