logo

మాజీ పోలీసు ఇంట్లో రూ.9.99 లక్షలు స్వాధీనం

జీవీఎంసీ 95వ వార్డు పరిధిలోని లక్ష్మీనగర్‌ ప్రాంతంలో ఓ ఇంట్లో అనుమానాస్పదంగా నిల్వ చేసిన నగదును సార్వత్రిక ఎన్నికల ఫ్లైయింగ్‌ సర్వేలైన్‌ టీం(ఎఫ్‌ఎస్‌టీ) స్వాధీనం చేసుకుంది.

Published : 07 May 2024 04:25 IST

తనిఖీలు చేస్తున్న ఎఫ్‌ఎస్‌టీ బృందం ప్రతినిధులు

పెందుర్తి, న్యూస్‌టుడే: జీవీఎంసీ 95వ వార్డు పరిధిలోని లక్ష్మీనగర్‌ ప్రాంతంలో ఓ ఇంట్లో అనుమానాస్పదంగా నిల్వ చేసిన నగదును సార్వత్రిక ఎన్నికల ఫ్లైయింగ్‌ సర్వేలైన్‌ టీం(ఎఫ్‌ఎస్‌టీ) స్వాధీనం చేసుకుంది. దీనికి సంబంధించి పెందుర్తి సీఐ లొడ్డు రామకృష్ణ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. లక్ష్మీపురంలో నివాసం ఉంటున్న ఏఆర్‌ మాజీ ఎస్‌ఐ దంతులూరి దుర్గాప్రశాంత్‌ వర్మ ఇంట్లో పెద్దఎత్తున నగదు ఉన్నట్లు నగర టాస్క్‌ఫోర్సు పోలీసులకు సమాచారం అందింది. ఆ మేరకు టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల సమాచారం మేరకు పెందుర్తి నియోజకవర్గం ఎన్నికల విభాగం ఎఫ్‌ఎస్‌టీ బృందం ఆ ఇంట్లో తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో రూ.9.99 లక్షలు నగదును స్వాధీనం చేసుకుని పోలీసులకు అప్పగించారు. ఈ నగదు జీడిపిక్కల వ్యాపారానికి తీసుకొచ్చినట్లు దుర్గాప్రశాంత్‌ వర్మ చెబుతున్నట్లు సీఐ తెలిపారు. దర్యాప్తులో ఇతర వివరాలు తెలుస్తాయని పేర్కొన్నారు. నగదును సీజ్‌ చేసి ఆర్‌వోకు అప్పగించినట్లు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని