logo
Published : 01 Dec 2021 06:09 IST

భయం వీడి..హాయిగా బతికేద్దాం

అవగాహన కల్పిస్తున్న వైద్య సిబ్బంది

ఒకప్పుడు ఎయిడ్స్‌ అంటే.. భయాందోళన, ఎవరేమనుకుంటారోనని బాధితులు లోలోపలే బాధపడేవారు. ఈ కారణంగా చాలామంది సరైన చికిత్స అందక మృత్యువాత పడేవారు. ప్రస్తుతం బాధితుల్లో చైతన్యం వచ్చింది. ఆసుపత్రులకు వెళ్లి ప్రభుత్వం ఇచ్చే మందులను వాడుతూ ధైర్యంగా జీవిస్తున్నారు. నేడు ఎయిడ్స్‌ దినం సందర్భంగా జిల్లాలో పరిస్థితిపై కథనం. - న్యూస్‌టుడే, విజయనగరం వైద్యవిభాగం

జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 71 వ్యాధి నిర్ధారణ కేంద్రాలున్నాయి. అలాగే 3 సుఖవ్యాధి చికిత్స కేంద్రాలు, విజయనగరం కేంద్రాసుపత్రి, పార్వతీపురం ఏరియా ఆసుపత్రుల్లో ఏఆర్‌టీ కేంద్రాలున్నాయి. వీటికి అనుబంధంగా మరో ఎనిమిది చోట్ల ఏఆర్‌టీలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎయిడ్స్‌ నియంత్రణకు ఏడు స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి. ఇవన్నీ ‘జాగ్రత్తలు పాటించండి.. వ్యాధి బారిన పడవద్ధు. మందులు వాడండి.. ఆనందంగా జీవించండి’ అనే నినాదంతో అవగాహన కల్పిస్తున్నాయి. ప్రభుత్వం తరఫున ప్రతి నెలా రూ.3 వేల నుంచి రూ.5 వేల విలువ చేసే మందుల కిట్లను అందిస్తోంది.

బాధితుల ఆవేదన

కొన్ని రోజులుగా తమపై వివక్ష చూపిస్తున్నారని బాధితులు ఇటీవల కలెక్టరేట్‌ వద్ద లోక్‌సత్తా ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. పౌష్టికాహారం, మందులు సకాలంలో ఇవ్వాలని, అందరినీ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తేవాలని కోరుతున్నారు. జిల్లాలో ఏడు వేల మందికిపైగా బాధితులుంటే కేవలం 1,253 మందికి మాత్రమే పింఛను ఇస్తున్నారని, అందరికీ ఇవ్వాలని డిమాండు చేస్తున్నారు.

పరిస్థితి ఇదీ...

 జిల్లాలో 2009 నుంచి ఇప్పటి వరకు 14,062 మంది బాధితులుగా నమోదు కాగా, ఇందులో క్రమం తప్పకుండా మందులు వాడుతున్న వారు 7,039 మంది ఉన్నారు. 4,803 మంది చనిపోగా, మిగిలినవారు వైద్య సిబ్బందికి సహకరించడం లేదని వైద్యారోగ్యశాఖ చెబుతోంది. H ప్రస్తుతం 1,253 మంది రూ.2,250 చొప్పున పింఛను అందుకుంటున్నారు. H ఇరు కుటుంబాల సమ్మతితో 52 మంది వివాహాలు చేసుకున్నారు. H బాధిత అనాథ పిల్లలకు రూ.500 చొప్పున 180 మందికి గతంలో పింఛను మంజూరు చేశారు. వీరి కోసం గొట్లాం, కొత్తవలసలో రెండు స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి. H ప్రయాణాల్లో 1,498 మందికి ఆర్టీసీ 50 శాతం, 42 మందికి రైల్వేశాఖ రాయితీ కల్పిస్తున్నాయి. H 2009 నుంచి 2021 వరకు 658 మంది గర్భిణులు ఎయిడ్స్‌ బారిన పడగా, ముందు జాగ్రత్తలు తీసుకోవడంతో ఆరోగ్యకరమైన పిల్లలు జన్మించారు.

కేసుల నమోదు

జిల్లా గణాంకాల ప్రకారం ఎక్కువగా 25 నుంచి 40 ఏళ్ల లోపు వారి దీని బారిన పడుతున్నట్లు తెలుస్తోంది. సంవత్సరాలవారీగా ఈ సారి బాధితుల సంఖ్య తగ్గినట్లు వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

సంవత్సరం పురుషులు మహిళలు ఇతరులు

2018-19 348 295 05

2019-20 314 296 06

2020-21 187 139 03

2021-22(నవంబరు) 114 111 06

జిల్లాలో పరిస్థితి అదుపులోనే ఉంది. అవగాహన పెరగడంతో బాధితుల సంఖ్య తగ్గుతోంది. వైరస్‌ బారిన పడిన ప్రతిఒక్కరూ విధిగా మందులు వాడాలి. అందిస్తున్న కిట్లను సద్వినియోగం చేసుకోండి. ఈ విషయంలో మాశాఖ ఆధ్వర్యంలోనూ నిరంతరం కృషి చేస్తున్నాం. ఇతర పింఛన్లు పొందేవారికి ఈ పింఛను రాదు. ఏదో ఒకదానికే అర్హత ఉంటుంది. మరింతమందికి పింఛను లబ్ధి కలిగేలా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతాం.

- రామ్మోహనరావు, ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ పర్యవేక్షకుడు, అదనపు డీఎంహెచ్‌వో

Read latest Vizianagaram News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని