logo

జీతాలు పెంచాలని ఆందోళన

తమను రెగ్యులర్‌ చేసి, జీతాలు పెంచాలని, కరవు భత్యం, మధ్యంతర భృతి, ఇతర సదుపాయాలు కల్పించాలని మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు బుధవారం కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వీరికి మద్దతు తెలిపిన సీఐటీయూ జిల్లా ప్రధాన

Published : 20 Jan 2022 05:10 IST

నినాదాలు చేస్తున్న కార్మికులు, నాయకులు

కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: తమను రెగ్యులర్‌ చేసి, జీతాలు పెంచాలని, కరవు భత్యం, మధ్యంతర భృతి, ఇతర సదుపాయాలు కల్పించాలని మున్సిపల్‌ కాంట్రాక్ట్‌ కార్మికులు బుధవారం కలెక్టరేట్‌ వద్ద ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వీరికి మద్దతు తెలిపిన సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి టి.వి.రమణ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో సేవల్ని క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చిన సీఎం జగన్‌మోహన్‌రెడ్డి మాట తప్పారన్నారు. వెంటనే కార్మికుల సమస్యలపై స్పందించి, న్యాయం చేయాలని డిమాండు చేశారు. సీఐటీయూ నాయకులు బి.సుధారాణి, కె.సురేష్‌, మున్సిపల్‌ యూనియన్‌ నాయకులు కుమారి, రమ, హరిబాబు, బాల తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని