logo

అవినీతిపై అధికారపార్టీ కౌన్సిలర్ల వాకౌట్‌

బొబ్బిలి పురపాలక సమావేశం రసాభాసగా మారింది. మంగళవారం పుర పాలిక అధ్యక్షుడు సావు వెంకట మురళీకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్లు సభ నుంచి అర్ధంతరంగా బయటకు వెళ్లిపోవడంతో కుర్చీలు ఖాళీ అయ్యాయి.

Updated : 01 Feb 2023 04:23 IST

బయటకు వెళ్లిపోతున్న కౌన్సిలర్లు

బొబ్బిలి, న్యూస్‌టుడే:  బొబ్బిలి పురపాలక సమావేశం రసాభాసగా మారింది. మంగళవారం పుర పాలిక అధ్యక్షుడు సావు వెంకట మురళీకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అధికార, ప్రతిపక్ష కౌన్సిలర్లు సభ నుంచి అర్ధంతరంగా బయటకు వెళ్లిపోవడంతో కుర్చీలు ఖాళీ అయ్యాయి. హాజరైన ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు సమక్షంలో ఇలా జరగడం గమనార్హం. ఇంజినీరింగు, పారిశుద్ధ్యం విభాగంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందని, ఇంధన బిల్లుల పేరిట రూ.లక్షలు కాజేస్తున్నారని అధికార పార్టీ సభ్యులు ఆరోపించారు. మరోవైపు వాటర్‌ వర్క్సు విభాగంలో తొలగిస్తున్న పాత సామగ్రికి కాళ్లొస్తున్నాయని, దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండు చేస్తూ సుమారు 10 పది మంది అధికారపక్ష సభ్యులు సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. వారి వెంట తెదేపాకు చెందిన మరో 10 మంది కౌన్సిలర్లు కూడా వెళ్లిపోవడంతో ప్రాంగణం బోసిపోయింది. ఎమ్మెల్యే కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ దీనిపై సమగ్ర దర్యాప్తు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని