logo

వృద్ధులు, వికలాంగుల ఓట్లకు వల

దివ్యాంగులు, 85 ఏళ్లు దాటిన వయోవృద్ధులు, మంచంపై లేవలేని పరిస్థితిలో ఉన్నవారు ఇంటి దగ్గరే ఓటుహక్కును వినియోగించుకునేలా ఎన్నికల సంఘం వెసులుబాటు ఇచ్చింది.

Published : 28 Mar 2024 04:37 IST

పార్వతీపురం, గ్రామీణం, న్యూస్‌టుడే: దివ్యాంగులు, 85 ఏళ్లు దాటిన వయోవృద్ధులు, మంచంపై లేవలేని పరిస్థితిలో ఉన్నవారు ఇంటి దగ్గరే ఓటుహక్కును వినియోగించుకునేలా ఎన్నికల సంఘం వెసులుబాటు ఇచ్చింది. ఇదే అదనుగా అధికార పార్టీ.. వాలంటీర్లతో వారి ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలం పెదబొండపల్లిలో ఇద్దరు వాలంటీర్లను ఇదే విషయమై తొలగించారు. తాజాగా చినబొండపల్లిలో 70 మంది దివ్యాంగులు, వయోవృద్ధుల నుంచి వాలంటీర్లు అంగీకార పత్రాలు తీసుకున్నట్లు ఆ గ్రామ మాజీ సర్పంచి, తెదేపా మండల అధ్యక్షుడు బోను చంద్రమౌళీశ్వరరావు ఎంపీడీవోకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎంపీడీవో ఆకిబ్‌ జావేద్‌ వద్ద ‘న్యూస్‌టుడే’ ప్రస్తావించగా ఫిర్యాదు వచ్చిందని, గురువారం గ్రామంలో దర్యాప్తు నిర్వహిస్తామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని