logo

సురేఖమ్మా.. కాపాడమ్మా!

మహిళా దినోత్సవం వేళ శుక్రవారం ఎంజీఎంకు వచ్చిన రాష్ట్ర ఆటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఎదుట ఓ మహిళ తన భర్త నుంచి కాపాడాలని కన్నీళ్లు పెట్టుకుంది.

Updated : 09 Mar 2024 06:37 IST

మంత్రి ముందు కన్నీంటి పర్యంతమవుతున్న రేణుక

న్యూస్‌టుడే, ఎంజీఎం ఆసుపత్రి : మహిళా దినోత్సవం వేళ శుక్రవారం ఎంజీఎంకు వచ్చిన రాష్ట్ర ఆటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఎదుట ఓ మహిళ తన భర్త నుంచి కాపాడాలని కన్నీళ్లు పెట్టుకుంది. హనుమకొండ జిల్లా కమలాపూర్‌ మండలానికి చెందిన రేణుక మంత్రి సురేఖను చూడగానే కాళ్లపై పడబోగా అంగరక్షకులు అడ్డుకున్నారు. కన్నీళ్లు పెడుతున్న ఆమెను లేవనెత్తి ఏమి ఆపద వచ్చిందని మంత్రి ప్రశ్నించారు. తన భర్త తనను నిత్యం వేధిస్తున్నారని, రెండు చేతులు విరిగిపోవడంతో ఆసుపత్రిలో చేరినట్లు రేణుక కన్నీటిపర్యంతమయ్యారు. తన భర్త వేధింపుల నుంచి కాపాడాలని వేడుకొన్నారు. స్పందించిన మంత్రి సురేఖ తక్షణమే కమలాపూర్‌ పోలీసులతో మాట్లాడి బాధితురాలికి న్యాయం చేయాలని ఆదేశించారు. పోలీసు కమిషనర్‌ అంబర్‌కిషోర్‌ ఝాతో మాట్లాడి బాధితురాలికి భరోసా కల్పించారు. ఆమెకు మెరుగైన వైద్యం అందించాలని అక్కడే ఉన్న ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్‌ చంద్రశేఖర్‌కు సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని