logo

పోలింగ్‌ కేంద్రాల్లోకి పోలీసులకు అనుమతి ఉండదు

ఎన్నికల నిర్వహణలో పోలీసులది కీలక పాత్ర.  ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడంలో వారి బాధ్యత చెప్పదగినది.   పోలింగ్‌ కేంద్రాల్లోకి వెళ్లేందుకు మాత్రం వారికి అనుమతి ఉండదు.

Published : 05 May 2024 05:20 IST

మీకు తెలుసా?

ఎన్నికల నిర్వహణలో పోలీసులది కీలక పాత్ర.  ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడంలో వారి బాధ్యత చెప్పదగినది.   పోలింగ్‌ కేంద్రాల్లోకి వెళ్లేందుకు మాత్రం వారికి అనుమతి ఉండదు. పోలింగ్‌ జరుగుతున్న సమయంలో  ఎలాంటి సమస్య వచ్చినా  సాధ్యమైనంత వరకు కేంద్రం బయటే పరిష్కరించాలి. శాంతి భద్రతల సమస్యలు తలెత్తినప్పుడు ఎన్నికల అధికారి పిలిచినప్పుడు మాత్రమే పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లేందుకు వారికి అనుమతి ఉంటుంది. ఎమ్మెల్యేలు, మంత్రులు లాంటి ప్రజాప్రతినిధులు వచ్చినా.. వారి వెంట లోపలికి వెళ్లకూడదు. పోటీలో ఉన్న అభ్యర్థికి రక్షణగా ఉండే సిబ్బందిని కూడా కేంద్రంలోకి అనుమతించరు. ప్రజాప్రతినిధులు, అభ్యర్థులు కేంద్రాల్లోకి వెళ్లినా భద్రతా సిబ్బంది, పోలీసులు మాత్రం ద్వారం వద్దనే ఉండాలి.

న్యూస్‌టుడే, ఖానాపురం (నర్సంపేట)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని