logo

‘భాజపాకు ఎన్నికల్లో గుణపాఠం తప్పదు’

గత పదేళ్ల పాలనలో ప్రజల మౌలిక సమస్యలు పరిష్కరించకుండా నిరంకుశ పాలన సాగిస్తూ ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేస్తున్న  భాజపాకు లోక్‌సభ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అన్నారు.

Published : 05 May 2024 05:28 IST

మాట్లాడుతున్న తెజస రాష్ట్ర అధ్యక్షుడు కోదండరాం

నెహ్రూసెంటర్‌, దంతాలపల్లి, న్యూస్‌టుడే: గత పదేళ్ల పాలనలో ప్రజల మౌలిక సమస్యలు పరిష్కరించకుండా నిరంకుశ పాలన సాగిస్తూ ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేస్తున్న  భాజపాకు లోక్‌సభ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అన్నారు. శనివారం మహబూబాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రంలో అధికారం చేపట్టిన నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రజల మౌలిక సమస్యల పరిష్కారానికి ఆలోచనలు చేయలేదన్నారు. దేశంలో భాజపా విధ్వంసం సృష్టిస్తోందన్నారు. ప్రజలకు ఏం చేశారో చెప్పకుండా మత విద్వేషాలను పెంచే రాజకీయాలు చేస్తోందన్నారు.  కార్పొరేట్‌ సంస్థల ఆదాయాన్ని పెంచే విధంగా పాలన సాగించారన్నారు. ఎరువుల మీద 42 శాతం, కొనుగోళ్లపై 32 శాతం రాయితీ తగ్గించారని దీంతో రైతుల ఆదాయం 11 శాతం తగ్గిందన్నారు. ప్రశ్నించేవారిపై ఈడీ కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురి చేస్తోందని ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చాలని కుట్రలు పన్నుతోందన్నారు. మహబూబాబాద్‌ లోక్‌సభ అభ్యర్థి పోరిక బలరాంనాయక్‌ను గెలిపించాలని కోరారు. సమావేశంలో తెజస రాష్ట్ర కార్యదర్శి అంబటి శ్రీనివాస్‌, జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ డోలి సత్యనారాయణ, టీపీజేఏసీ నాయకులు మైస శ్రీనివాస్‌, న్యాయవాది మామిడాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పెద్దముప్పారం గ్రామానికి చెందిన శిరీష  గ్రూప్‌-4 ఉద్యోగం రాకపోవడంతో మనోవేదనకు గురై ఇటీవల ఆత్మహత్య చేసుకోగా బాధిత కుటుంబాన్ని కోదండరాం పరామర్శించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని