logo

నియోజకవర్గాలకు ఈవీఎంల కేటాయింపు పూర్తి

వరంగల్‌ లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 13న పోలింగ్‌ నేపథ్యంలో పార్లమెంట్‌ పరిధిలోని 5 నియోజక వర్గాలకు ఈవీఎంలు కేటాయించినట్లు రిటర్నింగ్‌ అధికారి ప్రావీణ్య తెలిపారు.

Published : 05 May 2024 05:49 IST

వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో బ్యాలెట్‌ పేపర్‌ బాక్స్‌కు సీల్‌ వేస్తున్న సిబ్బంది

వరంగల్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: వరంగల్‌ లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 13న పోలింగ్‌ నేపథ్యంలో పార్లమెంట్‌ పరిధిలోని 5 నియోజక వర్గాలకు ఈవీఎంలు కేటాయించినట్లు రిటర్నింగ్‌ అధికారి ప్రావీణ్య తెలిపారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఎన్నికల సాధారణ పరిశీలకురాలు బండారి స్వాగత్‌ రణ్వీర్‌చంద్‌, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో శనివారం 5 నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంల రెండోదశ ర్యాండమైజేషన్‌ను ఆమె పూర్తి చేశారు. వచ్చే ఆదివారం ర్యాండమైజేషన్‌ ద్వారా మిగిలిన వరంగల్‌ పశ్చిమ, పరకాల నియోజకవర్గాలకు ఈవీఎంలను కేటాయిస్తామన్నారు. అనంతరం పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను భద్రపరిచే బ్యాలెట్‌ పేపర్‌ బాక్స్‌కు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఎన్నికల సిబ్బంది సీల్‌ వేశారు. అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, డీఆర్వో శ్రీనివాస్‌, ఆర్డీఓ సిడాం దత్తు తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని