logo

సిరా గుర్తు వేసే వేలు లేకపోతే..?

పోలింగ్‌ రోజు ఓటరు ఓటేసినట్లు తెలిసేందుకు, అదే ఓటరు మళ్లీ ఓటు వేయకుండా ఉండేందుకు  సిబ్బంది ఓటరు ఎడమ చేతి చూపుడు వేలికి సిరా గుర్తు పూస్తారు. ఈ సంగతి అందరికీ తెలిసిందే.

Updated : 06 May 2024 06:36 IST

పోలింగ్‌ రోజు ఓటరు ఓటేసినట్లు తెలిసేందుకు, అదే ఓటరు మళ్లీ ఓటు వేయకుండా ఉండేందుకు  సిబ్బంది ఓటరు ఎడమ చేతి చూపుడు వేలికి సిరా గుర్తు పూస్తారు. ఈ సంగతి అందరికీ తెలిసిందే. కానీ ఓటరుకు ఎడమ చేతికి చూపుడు వేలు లేకపోతే ఏ వేలికి సిరా గుర్తు వేయాలో కేంద్ర ఎన్నికల సంఘం సూచించింది. మధ్య వేలికి, అదీ లేకపోతే బొటన వేలికి, అసలు ఎడమ చేయే లేకపోతే కుడి చేతి చూపుడు వేలికి, అది లేకపోతే మధ్య వేలికి, ఆ తర్వాత ఉంగరం వేలికి సిరా గుర్తు వేస్తారు. ఒకవేళ ఓటరుకు రెండు చేతులూ లేకపోతే కాలి వేళ్లకు సిరా గుర్తు పూస్తారు.

న్యూస్‌టుడే, ఖానాపురం (నర్సంపేట)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని