logo

‘ప్రధాని మోదీ తెలంగాణకు చేసింది శూన్యం’

రాష్ట్ర విభజన చట్టం హామీలను విస్మరించిన భాజపాకు లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తప్పదని, రాహుల్‌గాంధీ ప్రధాని కావడం ఖాయమని కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య, వరంగల్‌ పశ్చిమ, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్‌ నాగరాజు అన్నారు.

Published : 06 May 2024 06:16 IST

గోకుల్‌నగర్‌ కూడలిలో ప్రసంగిస్తున్న ఎంపీ అభ్యర్థి కావ్య, చిత్రంలో ఎమ్మెల్యేలు రాజేందర్‌రెడ్డి, కేఆర్‌.నాగరాజు

ఎన్జీవోస్‌కాలనీ, కాజీపేట టౌన్‌, ధర్మసాగర్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర విభజన చట్టం హామీలను విస్మరించిన భాజపాకు లోక్‌సభ ఎన్నికల్లో ఓటమి తప్పదని, రాహుల్‌గాంధీ ప్రధాని కావడం ఖాయమని కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య, వరంగల్‌ పశ్చిమ, వర్ధన్నపేట ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, కేఆర్‌ నాగరాజు అన్నారు. ఆదివారం హనుమకొండ గోకుల్‌నగర్‌ కూడలి, కేయూ రోడ్డులోని హనుమాన్‌నగర్‌ జంక్షన్‌,  కాజీపేట చౌరస్తాలో రోడ్డుషో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ అభివృద్ధికి చేసింది శూన్యమన్నారు. ఊసరవెల్లిలా రంగులు మార్చి భాజపాలోకి చేరిన అరూరి రమేశ్‌కు ఈ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలన్నారు. జిల్లా మహిళా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు బంక సరళ, సీనియర్‌ నాయకుడు నాయిని లక్ష్మారెడ్డి, కార్పొరేటర్లు రవీందర్‌, విజయశ్రీ రజాలి, మాజీ కార్పొరేటర్‌ కుమారస్వామి, పాల్గొన్నారు.

ధర్మసాగర్‌ మండలంలోని మల్లకపల్లి, ధర్మాపురం, కరుణాపురం, పెద్దపెండ్యాల, తాటికాయల, కాశగూడెం గ్రామాల్లో స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి సింగపురం ఇందిరతో కలిసి అభ్యర్థి కడియం కావ్య రోడ్‌షో నిర్వహించారు. పెద్దపెండ్యాల అభివృద్ధికి సహకరిస్తామని, ఆర్‌టీసీ బస్సు సౌకర్యం, ఆరునెలల్లో సాగునీరందిస్తామని ఎమ్మెల్యే అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని