logo

కాంగ్రెస్‌ వచ్చాక పథకాలు ఆగాయి

కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను విస్మరించిందని, లోక్‌సభ ఎన్నికల్లో భారాసకు ఓటు వేసి గెలిపిస్తే ప్రభుత్వం మెడలు వంచి హామీలను అమలు చేయిస్తామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.

Published : 06 May 2024 06:17 IST

పెద్దవంగరలో ఉపన్యసిస్తున్న మాజీ మంత్రి దయాకర్‌రావు, చిత్రంలో మధుసూదనాచారి, రాకేష్‌రెడ్డి

పెద్దవంగర, న్యూస్‌టుడే: కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను విస్మరించిందని, లోక్‌సభ ఎన్నికల్లో భారాసకు ఓటు వేసి గెలిపిస్తే ప్రభుత్వం మెడలు వంచి హామీలను అమలు చేయిస్తామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలు, తండాలలో మాజీ స్పీకర్‌ మధుసూదనాచారితో కలిసి ఆయన విస్తృతంగా పర్యటించారు. ఈ సందర్భంగా దయాకర్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి వంటి పథకాలు ఆగిపోయాయని, విద్యుత్తు కష్టాలు, రైతుల ఆత్మహత్యలు పెరిగాయని విమర్శించారు. వరంగల్‌ ఎంపీ అభ్యర్థి సుధీర్‌ కుమార్‌ను గెలిపించాలని కోరారు. వరంగల్‌-నల్గొండ-ఖమ్మం పట్టభద్రుల భారాస ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్‌రెడ్డి, మండలాధ్యక్షుడు ఐలయ్య, యాదగిరిరావు, వేణుగోపాల్‌రావు, ఊషయ్య, పటేల్‌నాయక్‌, కుమార్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని