logo

ఖర్చుల వివరాలు తప్పనిసరిగా చెప్పాలి

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తప్పనిసరిగా ఖర్చుల వివరాలను అందజేయాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు ఎ.ధిలీబన్‌, ధీరజ్‌ సింగా పేర్కొన్నారు.

Published : 07 May 2024 07:10 IST

ఈవీఎంల కమిషనింగ్‌ ప్రక్రియను పరిశీలిస్తున్న రిటర్నింగ్‌ అధికారి ప్రావీణ్య

వరంగల్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు తప్పనిసరిగా ఖర్చుల వివరాలను అందజేయాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు ఎ.ధిలీబన్‌, ధీరజ్‌ సింగా పేర్కొన్నారు. రెండో విడత వ్యయ పరిశీలనలో భాగంగా కలెక్టరేట్‌లో సోమవారం అభ్యర్థులు ఇప్పటివరకు నిర్వహించిన వ్యయ సంబంధిత రిజిస్టర్లను వారు పరిశీలించారు. బరిలో ఉన్న 42 మందిలో 38 మంది అభ్యర్థులు తమ రిజిస్టర్లను సమర్పించినట్లు పేర్కొన్నారు. ఈ నెల 10న మూడో విడత పరిశీలనకు అభ్యర్థులు లేదా వారి ప్రతినిధులు తమ వ్యయ రిజిస్టర్లతో హాజరుకావాలన్నారు. నోడల్‌ అధికారులు రాంరెడ్డి, సంజీవరెడ్డి పాల్గొన్నారు.

సజావుగా ఈవీఎంల కమిషనింగ్‌

వరంగల్‌ కలెక్టరేట్‌: ఈవీఎంల కమిషనింగ్‌, మాక్‌పోల్‌ ప్రక్రియను సజావుగా నిర్వహించాలని రిటర్నింగ్‌ అధికారి ప్రావీణ్య సంబంధిత అధికారులకు సూచించారు. వరంగల్‌ పార్లమెంట్‌ పరిధిలోని వరంగల్‌ తూర్పు, వర్ధన్నపేట నియోజకవర్గాలకు సంబంధించి ఎనుమాముల మార్కెట్‌లో కొనసాగుతున్న ఈవీఎంల కమిషనింగ్‌, మాక్‌పోల్‌ ప్రక్రియను సోమవారం ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్వహణ తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి, ఏఆర్వోలు అశ్వినీ తానాజీ, సిడాం దత్తు, తహసీల్దార్లు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని