logo

అంతర్గత కలహాలపై కాంగ్రెస్‌ అధిష్ఠానం సీరియస్‌

లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్‌ తేదీ సమీపిస్తున్న సమయంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన  ప్రజాప్రతినిధులు పరస్పర విమర్శలు చేసుకోవడాన్ని కాంగ్రెస్‌ అధిష్ఠానం సీరియస్‌గా తీసుకుంది.

Published : 09 May 2024 01:50 IST

రంగంపేట, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికలకు పోలింగ్‌ తేదీ సమీపిస్తున్న సమయంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన  ప్రజాప్రతినిధులు పరస్పర విమర్శలు చేసుకోవడాన్ని కాంగ్రెస్‌ అధిష్ఠానం సీరియస్‌గా తీసుకుంది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా మంగళవారం రాత్రి సీఎం రేవంత్‌రెడ్డి వరంగల్‌ పర్యటనకు వచ్చారు. ఇలాంటి సమయంలో మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి మధ్య చరవాణిలో జరిగిన సంభాషణ ఆడియో బయటకు రావడంపై టీపీసీసీ తీవ్రంగా పరిగణించింది. బుధవారం వివిధ దినపత్రికల్లో ప్రచురితమైన కథనాల క్లిప్పింగ్‌లను కొందరు జిల్లా నాయకులు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌కు పంపించారు. మంత్రి, ఎమ్మెల్యే మధ్య దూరం పెరగడానికి గల కారణాలు, ఇతర అంశాలపై నిఘా వర్గాలు సైతం ఆరా తీశాయి. ఇటీవల జరిగిన చేరికలతో పరకాల, వరంగల్‌ తూర్పు నియోజకవర్గాల్లో విభేదాలు బయటపడ్డాయని గుర్తించారు. నాయకుల మధ్య ఏమైనా విభేదాలుంటే లోక్‌సభ ఎన్నికల తర్వాత మాట్లాడుకుందాం, వరంగల్‌ ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేయాలని అధిష్ఠానం సూచించినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని