logo

‘ప్రత్యేక త చాటాలి.. ఓటు మురవాలి

ఎన్నికల్లో పోలింగ్‌ శాతం పెంచడానికి భారత ఎన్నికల సంఘం పలు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. పలు ప్రయోగాలు అమలు చేస్తూ సత్ఫలితాలను సాధిస్తోంది.

Updated : 09 May 2024 05:49 IST

మహిళ, ఆదర్శ, యువ, దివ్యాంగ పోలింగ్‌ కేంద్రాలే స్ఫూర్తి.. 

ఎన్నికల్లో పోలింగ్‌ శాతం పెంచడానికి భారత ఎన్నికల సంఘం పలు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. పలు ప్రయోగాలు అమలు చేస్తూ సత్ఫలితాలను సాధిస్తోంది. ఈ నెల 13న జరిగే లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్‌ శాతం పెంచడానికి యువ, మహిళ, ఆదర్శ, దివ్యాంగుల కోసం ప్రత్యేక పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. వరంగల్‌, మహబూబాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో అసెంబ్లీ సెగ్మెంట్లవారీగా ఏర్పాటు చేయనున్న ప్రత్యేక పోలింగ్‌ కేంద్రాల వివరాలతో ప్రత్యేక కథనం..

ఈనాడు, మహబూబాబాద్‌, న్యూస్‌టుడే, వరంగల్‌ కలెక్టరేట్‌

గత అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్‌ కేంద్రం వద్ద మహిళలు

ఇది డోర్నకల్‌ అసెంబ్లీ సెగ్మెంటు దంతాలపల్లి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల. ఇందులోని దక్షిణం వైపు ఉన్న 12వ నెంబరు గదిని  మహిళా పోలింగ్‌ కేంద్రంగా ఏర్పాటు చేయనున్నారు.   ఇక్కడ 934 ఓటర్లు ఉండగా 444 మంది పురుషులు, 489 మంది మహిళలు, ఒకరు థర్డ్‌జెండర్‌ ఉన్నారు. 45 మంది మహిళలు అధికంగా ఉన్నారు.

ఆమె కోసం అయిదు కేంద్రాలు

అతివల ఓటింగ్‌ శాతాన్ని పెంచడమే ధ్యేయంగా ఎన్నికల సంఘం మహిళా పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఇందులో విధులు నిర్వహించే సిబ్బంది సైతం మహిళలే. చూడగానే ఆకట్టుకునేలా ఈ కేంద్రాలను పువ్వులు, మామిడి తోరణాలతో అందôగా తీర్చిదిద్దుతారు. వరంగల్‌, మహబూబాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గంలోని 14 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ములుగు, పినపాక, భద్రాచలంలో ఒక్కొక్కటి చొప్పున.. మిగిలిన చోట్ల ఐదు చొప్పున కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ రెండు స్థానాల్లో 17,13,072 మంది మహిళా ఓటర్లున్నారు. పురుషుల కంటే వీరి సంఖ్య 69,815 ఎక్కువ.

వరంగల్‌ పరిధిలో..

  • స్టేషన్‌ఘన్‌పూర్‌  
  • పాలకుర్తి      
  • పరకాల        
  • వరంగల్‌ పశ్చిమ    
  • వరంగల్‌ తూర్పు        
  • వర్ధన్నపేట        
  • భూపాలపల్లి  

వరంగల్‌ పరిధిలో..

  • పీఎస్‌ నెం: 192 (రఘునాథపల్లి, జడ్పీఎస్‌ఎస్‌), 35 (ధర్మసాగర్‌, జడ్పీఎస్‌ఎస్‌ బాలికల), 180 (తిమ్మంపేట)  202 (కళ్లెం), 106 (చిన్నపెండ్యాల)  
  • 207 (వడ్డెకొత్తపల్లి), 187 (మైలారం) 141 (ఏడునూతుల), 67 (దేవరుప్పుల), 257 (తొర్రూరు పట్టణం)
  • 118 (దామెర), 166 (ధర్మారం) 214 (సంగెం), 104 (ఆత్మకూరు), 50 (పరకాల పట్టణం)
  • 180 (పింగిళి ప్రభుత్వ మహిళా కళాశాల వడ్డేపల్లి), 01 (బేబీ సైనిక్‌ స్కూల్‌, గోపాలపూర్‌),  28 (సెయింట్‌ జోసెఫ్‌ స్కూల్‌), 189 (పట్టణ ప్రకృతి వనం, కనకదుర్గ కాలనీ), 228 (సెయింట్‌ పీటర్స్‌ సెంట్రల్‌ స్కూల్‌)
  • 14 (గోల్డెన్‌ ఓక్‌ స్కూల్‌, కొత్తవాడ) 38 (మండి బజారు, కిడ్డికూప్‌ స్కూల్‌) 137 (గిర్మాజీపేట),  176 (ఉర్సు, ప్రభుత్వ ఎయిడెడ్‌ శ్రీ వెంకటేశ్వర స్కూల్‌), 210 (శంభునిపేట, జీహెస్‌ఎస్‌)
  • 26 (హసన్‌పర్తి), 92 (మడికొండ), 173 (పున్నేలు), 203 (ఫుస్కోస్‌ స్కూల్‌, వర్ధన్నపేట పట్టణం), 260 (పర్వతగిరి, జడ్పీఎస్‌ఎస్‌) 
  • 27 (ప్రభుత్వ డిగ్రీ కళాశాల, భూపాలపల్లి), 146 (గణపురం, జడ్పీఎస్‌ఎస్‌), 166 (చిట్యాల), 192 ( మొగుళ్లపల్లి), 223 (రేగొండ)

మహబూబాబాద్‌ పరిధిలో..

  • పీఎస్‌ నెం: 22 (చంద్రుగూడెం, గూడూరు), 46 (కేసముద్రం), 63 (ఇనుగుర్తి), 148 (బ్రాహ్మణకొత్తపల్లి, నెల్లికుదురు), 252 (పత్తిపాక, మహబూబాబాద్‌ పట్టణం)
  • 160 (డోర్నకల్‌ పట్టణం, జడ్పీఎస్‌ఎస్‌), 12 (దంతాలపల్లి), 29 (కౌసల్యదేవిపల్లి, నర్సింహులపేట), 52 (కురవి), 234 (కాంపెల్లి, జడ్పీఎస్‌ఎస్‌) 
  • 136 (జడ్పీఎస్‌ఎస్‌, ములుగు)
  • 12 (దుగ్గొండి), 71 (నల్లబెల్లి, ఎంపీపీఎస్‌), 93 (ఖానాపురం), 158 (నర్సంపేట), 209 (అమీనాబాద్‌) 
  • 121/ఎ (ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ బాలికల పాఠశాల, మణుగూరు)
  • 29 (పంచాయతీ కార్యాలయం, బయ్యారం), 85 (ఇల్లెందు, ఎంపీపీఎస్‌), 171 (జడ్పీఎస్‌ఎస్‌, బొమ్మనపపల్లి), 190 (జడ్పీఎస్‌ఎస్‌, బాలికల, గార్ల), 218 (జడ్పీఎస్‌ఎస్‌, కొమినేపల్లి)
  • 172 (నన్నపనేని ఎంపీపీఎస్‌, భద్రాచలం)

ఇది మహబూబాబాద్‌ అసెంబ్లీ సెగ్మెంటులోని నెల్లికుదురు ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన 138 నెంబరు పోలింగ్‌ బూత్‌. ఆదర్శ పోలింగ్‌ బూత్‌గా గుర్తించారు. ఇందులో 1225 మంది ఓటర్లున్నారు. 597 మంది పురుషులు, 628 మంది మహిళలున్నారు.

ఆదర్శం ఆకట్టుకునేలా

ఆహ్లాదకరమైన వాతావరణంలో ఓటర్లు ఓటేసేలా.. అది అందరికీ స్ఫూర్తిగా ఉండేలా అధికారులు ఆదర్శ పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేలా.. కేంద్రాల్లోకి అడుగు పెట్టగానే కొత్త అనుభూతిని పొందేలా రంగు రంగు కాగితాలతో, కొబ్బరి, అరటి ఆకులతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తారు. ఓటేయడానికి వచ్చే ఓటర్లకు పువ్వులు ఇచ్చి స్వాగతం పలుకుతారు.. 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో ములుగు, పినపాక, భద్రాచలం, ఇల్లెందులో ఒక్కొక్కటి చొప్పున మిగిలిన 10 శాసనభ నియోజకవర్గాల్లో ఐదు చొప్పున ఈ కేంద్రాలను కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు.

మహబూబాబాద్‌ పరిధిలో..

  • మహబూబాబాద్‌  
  • డోర్నకల్‌          
  • ములుగు          
  • నర్సంపేట          
  • పినపాక            
  • ఇల్లెందు              
  • భద్రాచలం

వరంగల్‌లో..

  • పీఎస్‌ నెం:131 (ఎంపీపీఎస్‌, మండలగూడెం), 85 (జడ్పీపీఎస్‌, సాయిపేట), 75 (జడ్పీపీఎస్‌,రాజవరం), 245 (జడ్పీఎస్‌హెచ్‌ఎస్‌, జఫర్‌గఢ్‌), 268 (జడ్పీపీఎస్‌ఎస్‌, కుందారం)    
  • 16 (జడ్పీపీఎస్‌, చిన్నమడూరు), 126 (గ్రామపంచాయతీ కార్యాలయం, కొడకండ్ల), 161 (జడ్పీపీఎస్‌, కొండూరు), 200 (జడ్పీపీఎస్‌ఎస్‌, పెద్దవంగర), 260 (జడ్పీపీహెచ్‌ఎస్‌, తొర్రూరు)
  • 160 (జడ్పీపీహెచ్‌ఎస్‌, గీసుగొండ), 215 (ప్రభుత్వ.జూ.క సంగెం), 27 (ఎంపీపీఎస్‌,చర్లపల్లి), 105 (ప్రభుత్వ జూ.క. ఆత్మకూరు), 76 (ఎంపీయూపీఎస్‌ పోచారం)
  • 138 (సెయింట్‌ గాబ్రియల్‌హై స్కూల్‌, ఫాతిమ నగర్‌), 167 (ప్రభుత్వ హైస్కూల్‌, సోమిడి), 6 (యూనివర్సిటి ఇంజినీరింగ్‌ కళాశాల, ఉమెన్‌, కె.యూ),116 (ప్రభుత్వ ప్రైమరీ పాఠశాల(ఉర్దూ), జులైవాడ), 68 (ప్రొగ్రెస్‌ హైస్కూల్‌, యాదవనగర్‌)
  • 33 (ఎస్‌ఆర్‌ బాలికల జూ.క. ఎల్బీ నగర్‌), 70 (లెర్నర్స్‌ ల్యాండ్‌ స్కూల్‌, ఎల్బీ నగర్‌),  99 (ప్రభుత్వ ఎయిడెడ్‌ వివేకానంద జూ.క. గిర్మాజీపేట), 124 (వరంగల్‌ సెంట్రల్‌ పబ్లిక్‌ స్కూల్‌, ఫోర్ట్‌ రోడ్డు), 150 (ప్లాటినం జూబ్లి హైస్కూల్‌, అబ్బనికుంట)
  • 52 (జడ్పీఎస్‌ఎస్‌ భీమారం), 155 (ఎంపీపీఎస్‌, తిమ్మాపూర్‌, రామ్‌గోపాల్‌పూర్‌), 171 (జడ్పీహెచ్‌ఎస్‌ ఇ.మీ ఒంటిమామిడిపల్లి), 198 (జడ్పీఎస్‌ఎస్‌ దమ్మన్నపేట), 262 (ఎంపీయూపీఎస్‌, పర్వతగిరి)
  • 30 (సింగరేణి మైన్స్‌ రేస్కూ స్టేషన్‌, భూపాలపల్లి), 110 (జడ్పీఎస్‌ఎస్‌, జడలపేట), 141 (ఎంపీపీఎస్‌, గణపురం), 195 (జడ్పీహెచ్‌ఎస్‌, మొగుళ్లపల్లి), 225 (జడ్పీపీఎస్‌, రేగొండ)

మహబూబాబాద్‌లో..

  • 241 (ఎంపీపీఎస్‌, ఇందిరానగర్‌ కాలనీ, మహబూబాబాద్‌), 59 (జడ్పీపీఎస్‌ ఇనుగుర్తి), 51 (ఎంపీపీఎస్‌, కేసముద్రం), 138 (ప్రభుత్వ జూ.క, నెల్లికుదురు), 25 (గ్రామపంచాయతీ కార్యాలయం, గూడూరు)
  • 7 (ఎంపీపీఎస్‌, ఆగపేట), 51 (ఎంపీపీఎస్‌, కురవి), 96 (జయ్యారం), 178 (సీరోలు),  222 (మండల పరిషత్తు కార్యాలయం సమావేశ మందిరం, మరిపెడ)
  • 101 (జడ్పీపీఎస్‌ఎస్‌, వెంకటాపూర్‌)
  • 41 (ఎంపీపీఎస్‌, చలపర్తి), 102 (జడ్పీపీఎస్‌ఎస్‌, బుధరావుపేట), 74 (జడ్పీపీఎస్‌ఎస్‌, నల్లబెల్లి), 260 (జడ్పీహెచ్‌ఎస్‌ రెడ్లవాడ), 217 (సెయింట్‌ థామస్‌ యూపీఎస్‌, తిమ్మరాయనిపహాడ్‌)
  • 104 (జడ్పీహెచ్‌ఎస్‌, మణుగూరు)
  • 113 (ప్రభుత్వ జూ.క. ఇల్లెందు)
  • 138 (ఎంపీపీఎస్‌, భద్రాచలం)  

యువత తరలిరావాలని..

నర్సంపేట అసెంబ్లీ సెగ్మెంటులోని నెక్కొండ జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలోని 248 నెంబరు పోలింగ్‌ కేంద్రం ఇది. ఇందులో 1129 మంది ఓటర్లున్నారు. 18 నుంచి 25 ఏళ్ల ఓటర్లు ఎక్కువగా ఉండడంతో దీన్ని ఎన్నికల అధికారులు యువ పోలింగ్‌ కేంద్రంగా గుర్తించారు.

యువ ఓటర్లను ఆకర్షించేలా ప్రతి అసెంబ్లీ సెగ్మెంటుకు ఒకటి చొప్పున యువ పోలింగ్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు.  18 నుంచి 25 ఏళ్ల లోపు వయసున్న ఓటర్లు అధికంగా ఉండే కేంద్రాలను ఎంపిక చేశారు.  యువ ఓటర్లును ఆకర్షించేలా వీటిని సుందరీకరిస్తారు. ఓటర్ల జాబితా ప్రకారం వరంగల్‌, మహబూబాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాల్లో 18 నుంచి 39 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న ఓటర్లు 16,22,871 మంది ఉన్నారు. ఈ పోలింగ్‌ కేంద్రాల్లో విధులు నిర్వహించే సిబ్బందితో పాటు బందోబస్తు నిర్వహించే పోలీసులు యువకులే ఉంటారు.

వరంగల్‌..

  • 154 (జడ్పీపీఎస్‌, శివునిపల్లి)
  • 47 (జడ్పీపీఎస్‌, బొమ్మెర)
  • 110 (జడ్పీహెచ్‌ఎస్‌, ఊరుగొండ)
  • 156 (సెయింట్‌ అన్నా హైస్కూల్‌, కాజీపేట) ః 22 (సీకెఎం, కళాశాల, దేశాయిపేట)
  • 206 (జడ్పీఎస్‌ఎస్‌, వర్ధన్నపేట)
  • 46 (ప్రభుత్వ జూ.క. భూపాలపల్లి)

మహబూబాబాద్‌..

  • 3 (ప్రభుత్వ డీఎన్‌టీపీఎస్‌,  తేజవాత్‌ రామ్‌సింగ్‌ తండా, గూడూరు) ః 163 (ఎంపీపీఎస్‌, డోర్నకల్‌)
  • 33 (ప్రభుత్వ ఆశ్రమ పాఠశాల, ఐలాపూర్‌)
  • 248 (జడ్పీహెచ్‌ఎస్‌, నెక్కొండ)
  • 101 (ఎంపీపీఎస్‌,సమితిసింగారం, మణుగూరు)
  • 123 (జడ్పీఎస్‌ఎస్‌, సుభాష్‌నగర్‌, ఇల్లెందు)
  • 151 (ఎంపీపీఎస్‌, ఆదర్శనగర్‌ కాలనీ, భద్రాచలం)

దివ్యాంగులకు సదుపాయం

మహబూబాబాద్‌ అసెంబ్లీ సెగ్మెంటులోని మహబూబాబాద్‌ పట్టణంలోని మండల పరిషత్తు ప్రాథమిక బాలికల పాఠశాలలోని 263 నెంబరు పోలింగ్‌ బూత్‌లో ఏర్పాటు చేస్తున్న దివ్యాంగుల పోలింగ్‌ కేంద్రం.

దివ్యాంగుల్లో చైతన్యం తీసుకొచ్చేలా.. వారి ఓటు శాతం పెరిగేలా అధికారులు దివ్యాంగుల ఆదర్శ పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇలా రెండు లోక్‌సభ స్థానాల్లోని ప్రతి అసెంబ్లీ సెగ్మెంటు పరిధిలో ఒక్కొక్కటి చొప్పున ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో ఎన్నికల విధులు నిర్వహించే వారు దివ్యాంగులైన ఉద్యోగులే. ఓటు హక్కు వినియోగించుకునే వారిలోనూ దివ్యాంగులు ఎక్కువగా ఉండనున్నారు.

వరంగల్‌లో..

పీఎస్‌ నెం: 151 (జడ్పీపీఎస్‌ఎస్‌, చాగల్లు)
54 (జడ్పీపీఎస్‌ఎస్‌, పాలకుర్తి)
24 (ఎంపీపీఎస్‌, రాయపర్తి)
17 (బిషప్‌బెరిట్టా హై స్కూల్‌)
186 (కౌటిల్య ఉన్నత పాఠశాల, కరీంబాద్‌)
37 (జడ్పీఎస్‌ఎస్‌, సీతంపేట)
38 (సింగరేణి రేస్కూ స్టేషన్‌, భూపాలపల్లి)

మహబూబాబాద్‌లో...

  • 263 (ఎంపీపీఎస్‌ బాలికల, మహబూబాబాద్‌)
  • 24 (జడ్పీఎస్‌ఎస్‌, మరిపెడ)
  • 138 (జడ్పీపీఎస్‌ఎస్‌ బాలుర, ములుగు)
  • 151 (జీడ్పీపీఎస్‌ఎస్‌ బాలుర, నర్సంపేట)
  • 196 (బీపీఎల్‌ పబ్లిక్‌ స్కూల్‌, సారపాక)
  • 107 (ప్రభుత్వ హైస్కూల్‌, ఇల్లెందు)
  • 161 (డివిజన్‌ ఫారెస్ట్‌ కార్యాలయం, భద్రాచలం)
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని