logo

గీత కార్మికులకు రూ.5 కోట్లతో సంక్షేమ నిధి

కల్లు గీత కార్మికుల కోసం సొంతంగా రూ.5 కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తానని కూటమి నరసాపురం లోక్‌సభ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు.

Published : 19 Apr 2024 04:36 IST

నరసాపురం ఎంపీ అభ్యర్థి వర్మ వెల్లడి

శ్రీనివాసవర్మకు బీఫాం అందిస్తున్న సత్యనారాయణ, సీతారామలక్ష్మి

భీమవరం పట్టణం, న్యూస్‌టుడే: కల్లు గీత కార్మికుల కోసం సొంతంగా రూ.5 కోట్లతో సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తానని కూటమి నరసాపురం లోక్‌సభ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. భీమవరంలోని పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నరసాపురం పార్లమెంటు నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్న శెట్టిబలిజ, గౌడ కులస్థుల సంక్షేమానికి తనవంతు సాయం అందిస్తానన్నారు. వైకాపా ప్రభుత్వం 56 బీసీ కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసినా ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఆరోపించారు.

బీఫాం అందజేత..

నరసాపురం ఎంపీ అభ్యర్థి శ్రీనివాసవర్మకు భాజపా బీఫాంను పార్టీ కేంద్ర కమిటీ ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి జారీ చేసినట్లు క్రమశిక్షణ సంఘం ఛైర్మన్‌ పాకా వెంకట సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ పత్రాన్ని ఆయనతో పాటు తెదేపా జిల్లా అధ్యక్షురాలు తోట సీతారామలక్ష్మి, జనసేన జిల్లా అధ్యక్షుడు కొటికలపూడి గోవిందరావు, భాజపా జిల్లా అధ్యక్షుడు నార్ని తాతాజీలు శ్రీనివాసవర్మకు అందజేశారు. నాయకులు కోళ్ల నాగేశ్వరరావు, చెనమల్ల చంద్రశేఖర్‌, పీవీఎస్‌ వర్మ, కోమటి రవికుమార్‌, కాయిత సురేంద్ర, తోట గంగరాజు, ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు, షేక్‌ షబీనా బేగం, బాలం వెంకటేశ్వర్లు, రాజు పాల్గొన్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని