logo

వైకాపా పాలనలో దళితులకు తీవ్ర నష్టం

వైకాపా పాలనలో దళితులకు తీవ్ర నష్టం వాటిల్లిందని మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌ అన్నారు. పవరుపేటలోని బడేటి విడిది కార్యాలయంలో మంగళవారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ దళిత సామాజిక వర్గానికి చెందిన 59 ఉప కులాల వారికి జగన్‌ అన్యాయం చేశారన్నారు.

Published : 01 May 2024 04:56 IST

ఐక్యత చాటుతున్న మాజీ మంత్రి జవహర్‌, బడేటి చంటి, దాసరి ఆంజనేయులు తదితరులు

ఏలూరు అర్బన్‌, న్యూస్‌టుడే: వైకాపా పాలనలో దళితులకు తీవ్ర నష్టం వాటిల్లిందని మాజీ మంత్రి కేఎస్‌ జవహర్‌ అన్నారు. పవరుపేటలోని బడేటి విడిది కార్యాలయంలో మంగళవారం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ దళిత సామాజిక వర్గానికి చెందిన 59 ఉప కులాల వారికి జగన్‌ అన్యాయం చేశారన్నారు. తెదేపా అమలు చేసిన 27 ఎస్సీ సంక్షేమ పథకాలను వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శించారు. అంబేడ్కర్‌ విదేశీ విద్యాదీవెన పథకానికి పేరు మార్చి ఆయన ప్రతిష్ఠను దిగజార్చారన్నారు. వైకాపా అయిదేళ్ల పాలనలో అనేక మంది దళితులు హత్యకు గురయ్యారని ఆరోపించారు. ఎన్డీయే ఏలూరు అసెంబ్లీ అభ్యర్థి బడేటి చంటి మాట్లాడుతూ తెదేపా ప్రభుత్వ హయాంలో దళితులు అన్ని విధాలుగా లబ్ధి పొందారని, వైకాపా పాలనలో వారికి ఏవిధమైన ప్రయోజనం చేకూరలేదన్నారు.  తెదేపా రాష్ట్ర కార్యదర్శి దాసరి ఆంజనేయులు మాట్లాడుతూ దళితులు అభ్యున్నతి సాధించాలంటే ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. సమావేశంలో మాజీ మంత్రి మరడాని రంగారావు, తెదేపా ఎస్సీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జాలా బాలాజీ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని