logo

ఎన్నికల్లో పోలీసుల పాత్ర కీలకం

ఎన్నికల నిర్వహణలో పోలీసుల పాత్ర ఎంతో కీలకమని ప్రత్యేక పరిశీలకుడు, విశ్రాంత ఐపీఎస్‌ అధికారి దీపక్‌మిశ్రా అన్నారు. లా అండ్‌ ఆర్డర్‌ అదనపు డీజీ శంఖబ్రత బాగ్చీ, పార్లమెంటు నియోజకవర్గ పోలీసు పరిశీలకుడు శైలేష్‌కుమార్‌ సిన్హా,

Published : 01 May 2024 05:03 IST

మాట్లాడుతున్న దీపక్‌మిశ్రా, చిత్రంలో కలెక్టర్‌, ఎస్పీ, ఉన్నతాధికారులు

భీమవరం అర్బన్‌, న్యూస్‌టుడే: ఎన్నికల నిర్వహణలో పోలీసుల పాత్ర ఎంతో కీలకమని ప్రత్యేక పరిశీలకుడు, విశ్రాంత ఐపీఎస్‌ అధికారి దీపక్‌మిశ్రా అన్నారు. లా అండ్‌ ఆర్డర్‌ అదనపు డీజీ శంఖబ్రత బాగ్చీ, పార్లమెంటు నియోజకవర్గ పోలీసు పరిశీలకుడు శైలేష్‌కుమార్‌ సిన్హా, ఏలూరు రేంజి ఐజీ అశోక్‌కుమార్‌, కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌, ఎస్పీ అజిత తదితరులతో కలిసి మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల విధులకు వన్నె తెచ్చేలా పోలీసులంతా పని చేయాలని సూచించారు. వివిధ బృందాల పనితీరు గురించి ఆయనకు కలెక్టర్‌ వివరించారు. జిల్లాలో చెక్‌పోస్టుల ఏర్పాటు, భద్రతా పర చర్యల  గురించి ఎస్పీ అజిత వివరించారు. అనంతరం కలెక్టరేట్‌లో కంట్రోల్‌ కేంద్రాన్ని పరిశీలకులు పరిశీలించారు. అదనపు ఎస్పీ భీమారావు, ఏటీవీ రవికుమార్‌, శిక్షణ ఉపకలెక్టర్‌ సంగీత్‌మాధుర్‌  పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని