logo

ప్రభుత్వ భూమిని అమ్మకానికి పెట్టి రూ.5 లక్షలు స్వాహా

ప్రభుత్వ భూమిని అమ్మకానికి పెట్టి రూ.5 లక్షలు కాజేసిన తండ్రి, ఇద్దరు కుమారులపై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం..

Published : 05 May 2024 05:37 IST

తండ్రి, ఇద్దరు కుమారులపై కేసు

శంషాబాద్‌, న్యూస్‌టుడే: ప్రభుత్వ భూమిని అమ్మకానికి పెట్టి రూ.5 లక్షలు కాజేసిన తండ్రి, ఇద్దరు కుమారులపై పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. శంషాబాద్‌ విమానాశ్రయం రన్‌వే ప్రహరీకి ఆనుకొని సయ్యద్‌గూడ రెవెన్యూ సంఖ్య 24, 25లో 200 ఎకరాల ప్రభుత్వ, అసైన్డ్‌ భూములున్నాయి. ఇందులో 5 ఎకరాల భూమి ఉందని బహదూర్‌గూడకు చెందిన ఏనుగు బుచ్చిరెడ్డి అతడి కుమారులు వెంకట్‌రెడ్డి, నర్సారెడ్డిలు నకిలీ దస్త్రాలను సృష్టించి విక్రయానికి పెట్టారు. గతేడాది అక్టోబరులో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన లచ్చిరాజుకు ప్రభుత్వ భూమిని చూపించి ఎకరాకు రూ.23 లక్షల చొప్పున రూ.1.15 కోట్లకు ఒప్పందం చేసుకుని రూ.5 లక్షలు అడ్వాన్స్‌గా తీసుకొన్నారు. రిజిస్ట్రేషన్‌ చేయాలని లచ్చిరాజు కోరినా బుచ్చిరెడ్డి స్పందించలేదు. అనుమానం వచ్చిన ఆయన శంషాబాద్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో భూములపై విచారించగా ప్రభుత్వ భూములుగా తేలింది. దీంతో తీసుకున్న నగదు ఇవ్వాలని కోరడంతో అతడిని బుచ్చిరెడ్డి బెదిరించారు. మోసపోయానని గ్రహించిన లచ్చిరాజు పోలీసులకు ఫిర్యాదు చేయడంలో కేసు నమోదు చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని