logo

రేపటి నుంచి తపాలా బ్యాలెట్‌ ఓటింగ్‌

పశ్చిమగోదావరి జిల్లాలో ఈ నెల 6, 7 తేదీల్లో తపాలా బ్యాలెట్‌ ఓటింగ్‌ నిర్వహించనున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే వారికి, అత్యవసర సేవల ఉద్యోగులకు ఈ అవకాశాన్ని కల్పించారు.

Published : 05 May 2024 05:54 IST

భీమవరం అర్బన్‌, న్యూస్‌టుడే: పశ్చిమగోదావరి జిల్లాలో ఈ నెల 6, 7 తేదీల్లో తపాలా బ్యాలెట్‌ ఓటింగ్‌ నిర్వహించనున్నారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే వారికి, అత్యవసర సేవల ఉద్యోగులకు ఈ అవకాశాన్ని కల్పించారు. ఆయా నియోజకవర్గాల పరిధిలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్‌ కేంద్రాల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల్లోపు ఈ ఓట్లు వినియోగించుకోవచ్చు. జిల్లాలో మొత్తం 15,477 మంది తపాలా బ్యాలెట్‌కు దరఖాస్తు చేసుకున్నట్లు కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ తెలిపారు. 6, 7 తేదీల్లో ఓటు హక్కు వినియోగించుకోలేకపోయిన వారు ఏడో తేదీ తర్వాత ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాలకు వెళ్లి బ్యాలెట్‌ను ఉపయోగించుకోవచ్చని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని