logo

అంబరాన్నంటినగణతంత్రసంబరాలు

కడప పోలీస్‌ పరేడ్‌ మైదానంలో బుధవారం గణతంత్ర వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయం 9 గంటలకు వేడుకలు ప్రారంభం కాగా... కార్యక్రమానికి కలెక్టర్‌ విజయరామరాజు, ఎస్పీ అన్బురాజన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కలెక్టర్‌ త్రివర్ణ

Published : 27 Jan 2022 01:45 IST


ప్రథమ బహుమతి పొందిన పంచాయతీరాజ్‌శాఖ శకటం

జిల్లా సచివాలయం, చిన్నచౌకు (కడప), న్యూస్‌టుడే: కడప పోలీస్‌ పరేడ్‌ మైదానంలో బుధవారం గణతంత్ర వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయం 9 గంటలకు వేడుకలు ప్రారంభం కాగా... కార్యక్రమానికి కలెక్టర్‌ విజయరామరాజు, ఎస్పీ అన్బురాజన్‌ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కలెక్టర్‌ త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేసి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా 15 శాఖలు శకటాలను ప్రదర్శించాయి. వైఎస్‌ఆర్‌ క్రీడాపాఠశాల విద్యార్థులు చేసిన జిమ్నాస్టిక్స్‌ ఆకట్టుకోగా.. చెమ్ముమియాపేట జడ్పీ బాలికోన్నత పాఠశాల విద్యార్థులు, సాయిబాబా ఉన్నత పాఠశాల విద్యార్థులు జయహో... దేశభక్తి గేయానికి , పుణ్యభూమి నా దేశం అనే పాటకు నృత్యం చేయగా , విస్‌డమ్‌ స్కూల్‌ విద్యార్థులు గుర్రపు స్వారీ చేశారు. ఇంటర్నేషనల్‌ ఢిల్లీ పబ్లిక్‌ స్కూల్‌ విద్యార్థుల న్యత్య ప్రదర్శన ఆకట్టుంది. కర్రసాము కళానిలయం విద్యార్థినీలు చేసిన కర్రసాము, వ్యక్తిగత రక్షణకు సంబంధించిన అంశాలతో చేసిన ప్రదర్శనలు అలరించాయి. ముద్ర డ్యాన్స్‌ అకాడమీ చేసిన నృత్యం అలరించగా అగ్నిమాపక శాఖ చేసిన ఫైర్‌ విన్యాసాలు ఆకట్టుకున్నాయి. * స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబీకులైన వెంకటసుబ్బయ్య కుమారుడు రఘురామమూర్తి, టేకూరి సుబ్బారావు కుమారుడు సురేష్, ఇండోపాక్‌ యుద్ధంలో పాల్గొన్న శైలేష్‌ రత్నయ్యలను కలెక్టర్‌ శాలువలతో సత్కరించారు. * ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను కలెక్టర్, ఎస్పీ, జేసీ తదితర అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా రూ.332.50 కోట్ల ఆస్తులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. * ప్రగతి శకటాలకు సంబంధించి 15 శాఖలు ప్రదర్శన చేయగా పంచాయతీరాజ్‌శాఖకు మొదటి బహుమతి, జిల్లా నీటి యాజమాన్య సంస్థకు రెండో బహుమతి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖకు మూడో బహుమతి లభించింది. ఉత్తమ కేటగిరిలో అటవీశాఖ, గృహనిర్మాణశాఖలకు ప్రత్యేక బహుమతులు అందజేశారు. ఆర్మ్‌డ్‌ ఫోర్సు, హోంగార్డు, స్కౌట్‌ బాలికలు వరుసగా మూడు స్థానాల్లో నిలవగా, కన్సోలేషన్‌లో బ్యాండు బృందానికి బహుమతి లభించింది. * గణతంత్ర వేడుకల్లో భాగంగా జిల్లాలోని వివిధ శాఖల్లో ప్రతిభ చూపిన ఉద్యోగులకు కలెక్టర్‌ విజయరామరాజు, ఎస్పీ అన్బురాజన్‌ ప్రశంసాపత్రాలు ప్రదానం చేశారు.  


ద్వితీయ బహుమతి సాధించిన జిల్లా నీటియాజమాన్య సంస్థ  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని