logo

పిల్లల కిడ్నాప్‌ అంటూ పుకార్లు

పీలేరు పట్టణంలో మంగళవారం రాత్రి చిన్న పిల్లల కిడ్నాప్‌ చేశారంటూ పుకార్లు వ్యాపించడం కలకలం రేపింది.

Updated : 20 Oct 2022 03:20 IST

కడప మార్గంలో గుమికూడిన జనం

పీలేరు గ్రామీణ, న్యూస్‌టుడే: పీలేరు పట్టణంలో మంగళవారం రాత్రి చిన్న పిల్లల కిడ్నాప్‌ చేశారంటూ పుకార్లు వ్యాపించడం కలకలం రేపింది. స్థానిక కడప మార్గంలో ముగ్గురు యువకులు నడుచుకుంటూ వెళుతుండగా కొంత మంది యువకులు వారిని అడ్డగించి ఎవరని ప్రశ్నించారు. వారు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కావడంతో అనుమానం వచ్చి దేహశుద్ధి చేశారు. ఇదే దృశ్యాలను వీడియోల్లో చిత్రీకరించి చిన్న పిల్లలను కిడ్నాప్‌ చేసే దుండగులను పట్టుకున్నారని వైరల్‌ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన కొందరు యువకులు పరిసర ప్రాంతాల్లో గ్రానైట్‌ పనులు చేసుకునే వారని తేలడంతో కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపామని సీఐ మోహన్‌రెడ్డి వివరించారు. పిల్లల కిడ్నాప్‌ అంటూ వచ్చిన వదంతుల్లో వాస్తవం లేదని, ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే వదంతులు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని