logo

‘సీబీఐ విచారణను కోరింది వైకాపానే’

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసును ఛేదించాలని కోరుతూ సీబీఐని కోరింది వైకాపానేనని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, కడప మేయర్‌ సురేష్‌బాబు స్పష్టం చేశారు.

Published : 04 Feb 2023 05:05 IST

మాట్లాడుతున్న మేయర్‌ సురేష్‌బాబు, పక్కన నాయకులు

అరవిందనగర్‌ (కడప), న్యూస్‌టుడే : మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసును ఛేదించాలని కోరుతూ సీబీఐని కోరింది వైకాపానేనని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, కడప మేయర్‌ సురేష్‌బాబు స్పష్టం చేశారు. శుక్రవారం కడపలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వాస్తవాలను తేల్చి నిజాలు బయటకు రావాలని ఎంపీ అవినాష్‌రెడ్డి కోరారని, ఈ విషయాన్ని కొన్ని వార్తా సంస్థలు పక్కదారి పట్టిస్తున్నాయన్నారు. మాజీ మంత్రి లోకేశ్‌ చేస్తున్న పాదయాత్రకు జనాలు లేకపోవడంతో ఇలా వివేకా హత్య కేసు గురించి విష ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వాస్తవాలను దాచిపెట్టి అవాస్తవాలను లోకేశ్‌ ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. హత్య జరిగిన సమయంలో అప్పటి ఇంటలిజెన్స్‌ అధికారి వెంకటేశ్వరరావు కేసు తప్పుదోవపట్టించారని ఆరోపించారు. సమావేశంలో నాయకులు సుబ్బారెడ్డి, రామలక్ష్మణ్‌రెడ్డి, కిరణ్‌, సుబ్బారెడ్డి, నాయక్‌, ఎల్లారెడ్డి, మాధవరెడ్డి, మనోజ్‌కుమార్‌, చక్రధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని