logo

ఆరోగ్యశ్రీ అవకతవకలపై విచారణకు వినతి

మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఆరోగ్యశ్రీ నిధుల్లో జరిగిన అవకతవకలపై అధికారులు విచారణ జరపాలని మదనపల్లె సీపీఐ నాయకులు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పద్మాంజలిదేవికి శనివారం వినతిపత్రం అందజేశారు.

Published : 05 Feb 2023 02:22 IST

సూపరింటెండెంట్‌ పద్మాంజలిదేవికి వినతిపత్రం అందజేస్తున్న సీపీఐ నాయకులు

మదనపల్లె వైద్యం: మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రిలో ఆరోగ్యశ్రీ నిధుల్లో జరిగిన అవకతవకలపై అధికారులు విచారణ జరపాలని మదనపల్లె సీపీఐ నాయకులు ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ పద్మాంజలిదేవికి శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... మదనపల్లె జిల్లాసుపత్రిలోని ఆరోగ్యశ్రీ విభాగంలో రూ.1.25 కోట్ల అవినీతి జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయని వాటిపై విచారించాలని కోరారు. దీనిపై ఇది వరకే ఆసుపత్రి ఎదుట సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించామని అయితే ఇప్పటి వరకు ఆసుపత్రి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. కలెక్టర్‌ ఛైర్మన్‌గా ఉన్న ఆసుపత్రిలో అవకతవకలు జరుగుతుంటే పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. ఈ మేరకు సూపరింటెండెంట్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యుడు కృష్ణప్ప, జిల్లా కార్యవర్గ సభ్యుడు సాంబశివ, పట్టణ కార్యదర్శి మురళి, నాయకులు నవీన్‌రెడ్డి, జయప్రకాష్‌, ఓబేలేసు తదితరుల పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని